BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 07 June 2026, 06:31 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చిన్నంపేట, బూరుగుగూడెం గ్రామాల్లో డ్రైనేజ్ దుర్గంధం – ప్రజల ప్రాణాలతో చెలగాటమా? అధికారులు మౌనమా?

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Jun, 2026 - 06:31 PM
137 వీక్షణలు

ఏలూరు జిల్లా: చాట్రాయి మండలం చిన్నంపేట, బూరుగుగూడెం గ్రామాలలో రోడ్డు పక్కన ఉన్న ఇళ్లు, షాపుల నుంచి వచ్చే డ్రైనేజ్ నీరు నేరుగా రోడ్డుపైకి వదులవడమే స్థానికులను నిత్యం ఇబ్బందుల్లో పెట్టుతోంది. ముఖ్య రహదారిపై మురుగు నీరు ప్రవహించటంతో, ప్రతి రోజు ప్రజలు, విద్యార్థులు, వృద్ధులు, ద్విచక్ర వాహనదారులు అవస్థలకు గురవుతున్నారు.

మురుగు నీటితో రోడ్డు బురదమయంగా మారి, దుర్వాసన వ్యాపిస్తోంది. వర్షం పడిన సందర్భంలో పరిస్థితి మరింత దారుణంగా మారి, "రోడు ఏది – డ్రైన్ ఏది" అనే అయోమయ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆవేదనతో పేర్కొన్నారు.

గ్రామస్తులు పలుమార్లు సంబంధిత అధికారులకు, గ్రామ పంచాయతీ సిబ్బందికి  పంచాయతీ స్పెషల్ ఆఫీసర్లకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. ప్రజా ఆరోగ్యానికి ముప్పుగా మారిన సమస్యపై అధికారులు మౌనంగా ఉన్నారని వారు మండిపడుతున్నారు.

"వ్యాధులు ప్రబలితే బాధ్యత ఎవరిది?" అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. దోమలు, ఈగలు పెరుగుదలతో డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నప్పటికీ అధికారుల స్పందన లేనందుకు తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

గ్రామంలోని రహదారిని మురుగు కాలువలా మార్చిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, రోడ్డు మీద వస్తున్న డ్రైనేజ్ నీటిని అరికట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తారా, లేక ప్రజల గోడును గాలికొడుస్తారా? అనే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన సమయం ఇప్పుడు దగ్గరపడింది.