BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 22 July 2026, 08:01 pm
Posted by : కూనురు మధు

చిట్యాల సెంటర్‌లో ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దగ్ధం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
22 Jul, 2026 - 08:01 PM
60 వీక్షణలు

చిట్యాల సెంటర్‌లో ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దగ్ధం

పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని, అలాగే విద్యార్థులపై పోలీసులతో దాడి చేయించడాన్ని నిరసిస్తూ చిట్యాల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. చిట్యాల కనకదుర్గ సెంటర్లో  కేంద్ర ప్రభుత్వానికి మరియు ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రధాని దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ​ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి పోకల దేవదాస్ మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తూ నియంతృత్వంగా వ్యవహరిస్తోంది. ప్రశ్నించే ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కేందుకు అక్రమ అరెస్టులకు పాల్పడుతోంది అన్నారు. తమ హక్కుల కోసం పోరాడుతున్న విద్యార్థులపై పోలీసులతో లాఠీఛార్జ్ చేయించడం అత్యంత దారుణం అని ​కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రతిపక్ష నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, విద్యార్థులపై అణచివేత చర్యలను స్వస్తి పలకాలని ఈ సందర్భంగా ఆయన  డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చిట్యాల కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఎద్దులపురి కృష్ణ, మున్సిపల్ చైర్మన్ పందిరి గీత, కౌన్సిలర్లు దశపాక లత , జేరిపోతుల సత్యనారాయణ, కోఆప్షన్ సభ్యులు, బెల్లి సత్తయ్య, ఇమ్రాన్, కాంగ్రెస్ నాయకులు  యువజన కాంగ్రెస్ నాయకులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.