BREAKING
thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి thumb మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ thumb పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి thumb మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ thumb పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి
Date of Publish : 29 July 2026, 09:27 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చనుబండలో కూటమి ప్రభుత్వ సంక్షేమ విజయాలను వివరించిన నక్కా రాము

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Jul, 2026 - 09:27 PM
249 వీక్షణలు

చాట్రాయి మండల రిపోర్టర్ గోళ్ళ సత్యనారాయణ 

చాట్రాయి: చాట్రాయి మండలం చనుబండ శివారు సూరంపాలెం గ్రామంలోని ఆరో బూత్‌లో నూజివీడు నియోజకవర్గ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నక్కా రాము కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.

చనుబండ పంచాయతీ పరిధిలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎంఆర్ఎఫ్ కింద 60 దరఖాస్తులు సమర్పించగా, వాటిలో 48 దరఖాస్తులకు ఆమోదం లభించి రూ.25,61,910 మంజూరయ్యాయని తెలిపారు. అలాగే ఎల్ఓసి కింద 10 దరఖాస్తులకు రూ.16,30,324 మంజూరై పేద కుటుంబాలకు వైద్య సహాయం అందిందన్నారు.

గత ఐదేళ్ల పాలనలో చనుబండ పంచాయతీకి సీఎంఆర్ఎఫ్ చెక్కులు దాదాపు అందలేదని, ఎల్ఓసి పథకం గురించి కూడా చాలా మందికి అవగాహన లేకపోయిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆరోగ్య రంగంలోనే లక్షల రూపాయల సహాయం అందించడం ప్రజలకు ఎంతో ఉపయోగపడిందని, ఇందుకు మంత్రి కొలుసు పార్థసారధికి చనుబండ పంచాయతీ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, తల్లికి వందనం, దీపం–2, శ్రీశక్తి, చేనేత కార్మికులకు సహాయం, 269 అన్న క్యాంటీన్లు, పేదలకు ఐదు లక్షల ఇళ్ల నిర్మాణం, గీత కార్మికులకు మద్యం దుకాణాల కేటాయింపు, వడ్డెరలకు మైనింగ్ లీజులు, ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా ఉచిత వైద్యం, సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం, మత్స్యకారులకు ఏటా రూ.20 వేల ఆర్థిక ప్రోత్సాహం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.

గత పాలనలో రహదారుల పరిస్థితి అధ్వాన్నంగా ఉండేదని, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా రహదారుల అభివృద్ధితో ప్రజల ప్రయాణం సులభంగా మారిందన్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణ పనులు వేగంగా, నాణ్యతతో కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

రాష్ట్ర అభివృద్ధి కొనసాగాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రజలంతా అండగా నిలవాలని, నూజివీడు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధికి ప్రజలు ఆశీర్వాదం అందించాలని నక్కా రాము పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.