BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 06 April 2026, 07:51 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చనుబండలో పిచ్చికుక్క స్వైర విహారం…

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Apr, 2026 - 07:51 PM
190 వీక్షణలు

చనుబండలో పిచ్చికుక్క స్వైర విహారం… ఇద్దరిపై దాడి, గ్రామంలో భయాందోళన

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో పిచ్చికుక్క స్వైర విహారం సృష్టించింది. గ్రామంలోని ఇండియన్ బ్యాంకు సమీపంలో తిరుగుతున్న పిచ్చికుక్క ఇద్దరు వ్యక్తులపై అకస్మాత్తుగా దాడి చేయడంతో కలకలం రేగింది.

ఈ ఘటనలో కొర్లమండ పంచాయతీకి చెందిన కుక్కలపు భాస్కరరావు తీవ్రంగా గాయపడగా, మరో మహిళ కూడా కుక్క దాడికి గురైంది. గాయపడిన వారిలో ఒకరిని విసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి, మరొకరిని తెల్లదేవరపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.

పిచ్చికుక్క భయంతో గ్రామ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గ్రామంలో విచ్చలవిడిగా తిరుగుతున్న కుక్కలను వెంటనే నియంత్రించాలని, ప్రజల భద్రత కోసం ఉన్నతాధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.