BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 22 March 2026, 03:06 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

చోరీకి గురైన బంగారు ఉంగరాలు లభ్యం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
22 Mar, 2026 - 03:06 PM
109 వీక్షణలు

బంగారు ఉంగరాలతో  పూజలు చేస్తున్న చిత్తూరుకు చెందిన దంపతులు

సత్య ప్రమాణాలకు నిలయమైన రాజనాల బండలో సత్య ప్రమాణం అనగానే చోరీకి గురైన బంగారు ఉంగరాలు ప్రత్యక్షమైనట్లు ఆలయ అర్చకులు కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్తూరుకు చెందిన ఓ కానిస్టేబుల్ భార్య వారి ఇంట్లో 2025 డిసెంబర్లో ఇంట్లో బీరువాలో 14 గ్రాముల 5 ఉంగరాలను పెట్టారు. వారం తర్వాత చూస్తే బీరువాలో బంగారు ఉంగరాలు కనిపించలేదు. చుట్టుపక్క వారిని విచారించిన చోరీకి గురైన బంగారం ఉంగరాల ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో మిత్రుల సలహా మేరకు సత్య ప్రమాణాల రాజనాల బండలో సత్య ప్రమాణం చేయటానికి ఆలయ నిర్వహకుల వద్ద అనుమతి తీసుకుని చుట్టుప్రక్కల పిల్ల వారిని బంధువులకు సమాచారం అందించారు. జనవరి 15న చుట్టుపక్కల వారితో కలసి ఆలయానికి సత్య ప్రమాణం చేయటానికి వచ్చారు. అయితే ఆలయ నిర్వహకులు విచారించి సత్య ప్రమాణం వాయిదా వేసి పంపారు. ఈ నేపథ్యంలో శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు చోరీ గురైన బంగారు ఉంగరాలు మూటకట్టి ఇంటి ఆవరణములో ఇంటి ముందర పడేసి వెళ్లినట్లు తెలిపారు. స్వామి మహిమ వల్లనే చోరీకి గురైన బంగారు ఉంగరాలు తిరిగి లభించాయని వాటిని స్వామి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.