BREAKING
ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్.
www.ntodaynews.com

గ్రీన్ గ్రోవ్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం

తెలంగాణ
14 Nov, 2025 - 08:47 AM
214 వీక్షణలు
గ్రీన్ గ్రోవ్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం NTODAY NEWS: చిట్యాల నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో గ్రీన్ గ్రోవ్ పాఠశాలలో జవహర్ లాల్ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం రోజున బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులు వివిధ వేషాధారణలో కనివిందు చేశారు అనంతరం జవహర్ లాల్ నెహ్రూ దేశానికి చేసిన సేవల గుర్తు చేసుకుంటూ ఉపన్యాస పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు ఉద్దేశించి మాట్లాడుతూ అందరూ అనుభవించే బాల్యం భగవంతుడు ఇచ్చిన ఓ అమూల్యమైన వరం అని అభం శుభం తెలియని ఆ పసి మనసులు ఉన్న పిల్లలు అంటే భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ కు ఎంతో ఇష్టపడే వారని, అందుచేత ఆయన పుట్టిన రోజునే ఏటా బాలల దినోత్సవం జరుపుకుంటున్నాం అని తెలియజేశారు. స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేశాడని, భారతదేశాన్ని గణతంత్ర రాజ్యాంగ రచనలు నెహ్రూ కీలక పాత్ర పోషించాడు అని అన్నారు. అంతేకాకుండా భారత మొదటి ప్రధానిగా భారతదేశ వివిధ రంగాలలో అభివృద్ధి చేశాడని, అందుకే ఆయన జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ జూలకంటి వేణుగోపాల్ రెడ్డి, ఏవో పోలా గోవర్ధన్, ఉపాధ్యాయులు, రాము, రమేష్, లింగయ్య, ఫరీద్, శేఖర్, సురేష్, విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.. Follow us on Website Facebook Instagram YouTube