BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 17 February 2026, 07:58 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

విప్ బీర్ల అయిలయ్యకు సీఎం రేవంత్ రెడ్డి ప్రశంస

తెలంగాణ
17 Feb, 2026 - 07:58 PM
386 వీక్షణలు
మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై విప్ బీర్ల అయిలయ్యకు సీఎం రేవంత్ రెడ్డి ప్రశంస NTODAY NEWS: హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలపై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యను ప్రత్యేకంగా అభినందించారు. హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి అయిలయ్య ముఖ్యమంత్రిని మంగళవారం కలిశారు. యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆరు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం సాధించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఉత్కంఠభరిత పరిస్థితుల్లో జనగామ మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ ఖాతాలో చేరింది. అయిలయ్య ప్రచారం నిర్వహించిన వార్డుల్లో పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా, చైర్‌పర్సన్ కడకంచి బాలమణి ఎన్నికలో ఆయన కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. సమన్వయంతో ముందుకు సాగితే రానున్న జడ్పీ ఎన్నికల్లో కూడా సానుకూల ఫలితాలు సాధించవచ్చని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించినట్లు తెలిసింది. మున్సిపాలిటీల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని అయిలయ్య కోరగా, దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. #Congress #RevanthReddy #BirlaAilaiah #MunicipalElections #TelanganaPolitics #Hyderabad #LocalElections Follow us on Website Facebook Instagram YouTube