BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 25 January 2026, 01:51 am
Posted by : NTODAY NEWS OFFICIAL

స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో సీఎం పర్యటన

తెలంగాణ
25 Jan, 2026 - 01:51 AM
380 వీక్షణలు
స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో సీఎం పర్యటన పుంగనూరు సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లిన జనసేన ఇంచార్జి సిరివేలు గంగాధర్ NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ రాఘవేంద్ర రాజు స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గ పర్యటనకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను హెలిపాడ్ వద్ద జనసేన పార్టీ పుంగనూరు నియోజకవర్గ ఇంచార్జి సిరివేలు గంగాధర్ (చిన్నా రాయల్) మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా మదనపల్లి కేంద్రంగా ఏర్పాటు చేయడంతో పాటు, పుంగనూరు నియోజకవర్గానికి చెందిన నాలుగు మండలాలను జిల్లాలో కలిపినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం పుంగనూరు నియోజకవర్గానికి సంబంధించిన పలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా సదుం మండలం జోగివారి పల్లి పంచాయితీ నాయినవారి పల్లి నుంచి దామలచెరువు మధ్య ఉన్న అటవీ ప్రాంతంలో సుమారు నాలుగు కిలోమీటర్ల రహదారి నిర్మాణం చేయాలని అక్కడి రైతుల కోరిక మేరకు విజ్ఞప్తి చేశారు. అలాగే పుంగనూరు పట్టణంలోని శుబారాం డిగ్రీ కళాశాలలో క్రీడా మైదానం అభివృద్ధి, ప్రహారి గోడ నిర్మాణం, కళాశాల మైదానానికి రోడ్డు మార్గం కల్పించాలని విద్యార్థులు, ప్రిన్సిపల్ అభ్యర్థన మేరకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిరివేలు గంగాధర్ మాట్లాడుతూ, పుంగనూరు జనసేన పార్టీ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే జనవాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చే సమస్యలను సంబంధిత స్థాయిలో పరిష్కారానికి తీసుకెళ్తామని తెలిపారు. పార్టీ నాయకత్వానికి, జనసైనికులకు ప్రాధాన్యత ఇస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు. #Swachhandhra #SwarnaAndhra #ChandrababuNaidu #JanaSenaParty #PunganurNews #ChittoorDistrict #PublicIssues #DevelopmentWorks #AndhraPradeshPolitic Follow us on Website Facebook Instagram YouTube