BREAKING
ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు నేటి నుంచి ఏపీలో ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానం చిట్యాల ​1వ వార్డులో తాగునీటి విలవిల.. పట్టించుకోని అధికారులు , ప్రజా ప్రతినిధులు ​సింగరేణి అతిథి గృహానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పల్నాడు అభివృద్ధే మనందరి ప్రధాన లక్ష్యం కావాలి: ప్రత్తిపాటి పుల్లారావు బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ఇన్‌చార్జ్ ఈవోగా బి. అశోక్ కుమార్ బాధ్యతల స్వీకరణ పసుమర్రు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు నేటి నుంచి ఏపీలో ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానం చిట్యాల ​1వ వార్డులో తాగునీటి విలవిల.. పట్టించుకోని అధికారులు , ప్రజా ప్రతినిధులు ​సింగరేణి అతిథి గృహానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పల్నాడు అభివృద్ధే మనందరి ప్రధాన లక్ష్యం కావాలి: ప్రత్తిపాటి పుల్లారావు బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ఇన్‌చార్జ్ ఈవోగా బి. అశోక్ కుమార్ బాధ్యతల స్వీకరణ పసుమర్రు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు
www.ntodaynews.com

ధర్మపురిలో కాంగ్రెస్ సర్పంచ్‌ల ఘన సన్మానం

తెలంగాణ
28 Dec, 2025 - 06:09 AM
214 వీక్షణలు

ధర్మపురిలో కాంగ్రెస్ సర్పంచ్‌ల ఘన సన్మానం

NTODAY NEWS: ధర్మపురి ధర్మపురి పట్టణంలోని లక్ష్మీనరసింహ గార్డెన్స్‌లో నియోజకవర్గ పరిధిలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచ్‌లకు ఘన సన్మాన కార్యక్రమం, అలాగే ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, డీసీసీ అధ్యక్షుడు నందయ్య, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు గార్లు పాల్గొన్నారు. ముందుగా పటేల్ విగ్రహం వద్ద నుంచి ర్యాలీగా బయలుదేరిన కాంగ్రెస్ నాయకులు, నంది చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఫంక్షన్ హాల్‌కు చేరుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ

స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 70 శాతం కంటే ఎక్కువ సర్పంచ్ స్థానాలను గెలుచుకుని ప్రజల విశ్వాసాన్ని మరోసారి పొందిందని అన్నారు.ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలిచారని తెలిపారు. స్థానిక ఎన్నికల తర్వాత రాజకీయంగా ఉనికిని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు అసహనంతో, విచక్షణారహితంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ముఖ్యంగా కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరిస్తూ, కాంగ్రెస్ పార్టీ నాయకులు నిజాలు మాట్లాడితే తట్టుకునే స్థితిలో బీఆర్ఎస్ లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు.పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమిని ముందే ఊహించిన బీఆర్ఎస్ నాయకత్వం, పోలింగ్ రోజున బీజేపీకి ఓటేయాలని పరోక్షంగా ప్రచారం చేసిందని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను కాళేశ్వరం ప్రాజెక్టుకు మళ్లించడం ద్వారా దళిత, గిరిజన వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఈ నిధుల మళ్లింపుపై త్వరలోనే తాను శాఖ మంత్రిగా సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి దోహదపడుతున్నాయని, సర్పంచ్‌లు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. సర్పంచ్‌ల విజయం కాంగ్రెస్ పార్టీ బలానికి నిదర్శనమని, రాబోయే ఎన్నికల్లో మరింత ఘన విజయాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపిందని, రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలు మరింత వేగవంతం చేస్తామని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి నియోజకవర్గానికి చెందిన సర్పంచ్‌లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు Follow us on Website Facebook Instagram YouTube