BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 06 March 2026, 04:25 am
Posted by : NTODAY NEWS OFFICIAL

కలుషిత తాగునీరు ప్రజల ఆరోగ్యంపై ముప్పు

తెలంగాణ
06 Mar, 2026 - 04:25 AM
255 వీక్షణలు
కలుషిత తాగునీరు – ప్రజల ఆరోగ్యంపై ముప్పు, అధికారులు స్పందించేది ఎప్పుడూ? NTODAY NEWS: కిస్మత్పూర్ కిస్మత్పూర్ గ్రామ పరిధిలోని బండ్లగూడ జాగిర్ దర్గా ఖలీజ్ ఖాన్ ప్రాంతంలో కలుషిత తాగునీటి సమస్యతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఏర్పాటు చేసిన వాటర్ ఫిల్టర్ ప్లాంట్ ఉన్నప్పటికీ పరిశుభ్రమైన తాగునీరు సరఫరా కాకపోవడంతో ప్రజలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల సమాచారం ప్రకారం, కలుషిత నీరు తాగడం వల్ల గొంతు నొప్పులు, చర్మ వ్యాధులు, విషజ్వరాలు వంటి ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు చర్మ సంబంధిత వ్యాధులు మరియు జ్వరాలతో బాధపడుతున్నారని వారు చెబుతున్నారు. పరిశుభ్రమైన తాగునీరు అందించాల్సిన బాధ్యత ఉన్న అధికారులు ఈ సమస్యపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఫిల్టర్ ప్లాంట్ ఏర్పాటు చేసినప్పటికీ సరైన నిర్వహణ లేకపోవడంతో ప్రజలకు ఉపయోగం లేకుండా పోయిందని స్థానికులు పేర్కొంటున్నారు. ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతున్న ఈ పరిస్థితిని అధికారులు ఎప్పుడు గుర్తిస్తారు? కలుషిత నీటి సమస్యకు ఎప్పుడు పరిష్కారం చూపిస్తారు? అనే ప్రశ్నలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి నీటి నాణ్యతను పరీక్షించి, ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. #Kismatpur #BandlagudaJagir #DrinkingWaterIssue #PublicHealth #TelanganaNews #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube