BREAKING
thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక
Date of Publish : 04 July 2026, 06:35 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

డాడీ అని పిలిచాడని బాలుడిని ఇంటికి తీసుకెళ్లిన వ్యక్తి.. 12 రోజుల తర్వాత పోలీస్ స్టేషన్‌లో అప్పగింపు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Jul, 2026 - 06:35 AM
149 వీక్షణలు

హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉప్పల్ చిలకనగర్‌కు చెందిన రాజేశ్వరి తన ఐదేళ్ల కుమారుడు నిఖిల్‌తో కలిసి విజయవాడ వెళ్లేందుకు తన తల్లితో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లింది. ఈ క్రమంలో నిఖిల్ అమ్మమ్మకు చెప్పకుండా బయటకు వెళ్లిపోయాడు.

అక్కడ చింతల్ రాంనగర్ ప్రాంతానికి చెందిన, ఏపీ రాజోలు వాసి షేక్ అహ్మద్ అలీని బాలుడు "డాడీ" అని పిలిచాడు. తన భార్య పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోవడంతో మానసికంగా ఒంటరిగా ఉన్న షేక్ అహ్మద్ అలీ, బాలుడిని తనతో తీసుకెళ్లి పెంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

అతడు నిఖిల్‌ను తన ఇంటికి తీసుకెళ్లి 12 రోజుల పాటు దాచిపెట్టాడు. అయితే బాలుడి అదృశ్యంపై మీడియాలో, సోషల్ మీడియాలో కిడ్నాప్ వార్తలు విస్తృతంగా రావడంతో భయపడిన నిందితుడు, బాలుడిని జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చాడు.

పోలీసుల ఎదుట బాలుడికి జ్వరం రావడంతో ఇంటికి తీసుకెళ్లి వైద్యం చేశానని చెప్పి నమ్మించే ప్రయత్నం చేసినా, విచారణలో అసలు విషయం బయటపడింది. దీంతో షేక్ అహ్మద్ అలీపై కేసు నమోదు చేసిన పోలీసులు, బాలుడు నిఖిల్‌ను అతని తల్లికి అప్పగించారు.