BREAKING
thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● శ్రీశైలం జలాలు తగ్గుముఖం.. నీటి నుంచి బయటపడుతున్న సంగమేశ్వరాలయం thumb ● నంద్యాలలో వైద్య, ఆరోగ్య శాఖల కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా మూడో రోజుకు thumb ● మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం thumb ● జైలు నుంచి విడుదలైన వాసుదేవ యాదవ్‌కు అఖిల భారత యాదవ మహా సంఘం సంఘీభావం thumb ● తలసాని శ్రీనివాస్ ను కలిసిన అఖిల భారత యాదవ సంఘము సభ్యులు thumb ● చిత్తూరులో వైసీపీ లీగల్ సెల్ టాస్క్‌ఫోర్స్ సమావేశం thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● శ్రీశైలం జలాలు తగ్గుముఖం.. నీటి నుంచి బయటపడుతున్న సంగమేశ్వరాలయం thumb ● నంద్యాలలో వైద్య, ఆరోగ్య శాఖల కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా మూడో రోజుకు thumb ● మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం thumb ● జైలు నుంచి విడుదలైన వాసుదేవ యాదవ్‌కు అఖిల భారత యాదవ మహా సంఘం సంఘీభావం thumb ● తలసాని శ్రీనివాస్ ను కలిసిన అఖిల భారత యాదవ సంఘము సభ్యులు thumb ● చిత్తూరులో వైసీపీ లీగల్ సెల్ టాస్క్‌ఫోర్స్ సమావేశం
Date of Publish : 04 April 2026, 10:07 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

దారి కోసం గొడవలా..? చట్టం మీవైపు ఉంది!

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Apr, 2026 - 10:07 AM
194 వీక్షణలు

దారి కోసం గొడవలా..? చట్టం మీవైపు ఉంది!

గ్రామాల్లో భూముల మధ్య దారుల వివాదాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. “నా భూమి మీదుగా వెళ్లొద్దు” అంటూ కొందరు గోడలు కట్టేసే ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. దీంతో చాలామంది తమ స్థలానికి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతూ, దారి కోసం అదనంగా భూమి కొనాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

అయితే ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా Indian Easements Act, 1882 స్పష్టమైన హక్కులను కల్పిస్తోంది.

ఈ చట్టంలోని సెక్షన్ 13 ప్రకారం, ఒక భూమికి వెళ్లడానికి ప్రత్యామ్నాయ మార్గం లేకపోతే పక్క భూమి యజమాని దారి ఇవ్వాల్సిందే. ఇది వారి ఇష్టం కాదు, భూమి యజమానికి ఉన్న హక్కు.

అదేవిధంగా సెక్షన్ 15 ప్రకారం, ఒక మార్గాన్ని 20 సంవత్సరాల పాటు నిరంతరాయంగా వినియోగిస్తే, ఆ దారిపై శాశ్వత హక్కు ఏర్పడుతుంది. గ్రామ పంచాయతీ మ్యాప్‌లో లేకపోయినా, ఎఫ్‌ఎంబీ రికార్డుల్లో నమోదు కాకపోయినా ఈ హక్కు చెల్లుబాటు అవుతుంది.

పొలానికి లేదా ఇంటికి వెళ్లే దారిని అడ్డుకోవడం చట్టరీత్యా నేరమని కోర్టులు కూడా స్పష్టం చేస్తున్నాయి. అవసరమైన దారిని నిరోధిస్తే, బాధితులు సివిల్ కోర్టును ఆశ్రయించి స్టే ఆర్డర్ పొందే అవకాశం ఉంది.

దారి సమస్యలతో బాధపడుతున్న వారు ముందుగా చట్టంపై అవగాహన పెంచుకుంటే, అనవసర వివాదాలను నివారించుకోవచ్చు. ఇకపై దారి కోసం ఎవరి దయపై ఆధారపడాల్సిన అవసరం లేదు… చట్టమే మీకు అండగా ఉంది. ఒక భూమిని సాగు చేసుకోవడానికి లేదా వాడు కోవడానికి మీకు దారి అవసరమైనప్పుడు దానిని అడ్డుకోవడం చట్టరీత్యా నేరమని హీరో వినాయక్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.