BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 23 March 2026, 07:27 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

దెయ్యాలకుంటపల్లి సర్పంచ్‌పై అవినీతి ఆరోపణలు – విచారణ కోరుతూ ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Mar, 2026 - 07:27 PM
139 వీక్షణలు

దెయ్యాలకుంటపల్లి సర్పంచ్‌పై అవినీతి ఆరోపణలు – విచారణ కోరుతూ ఫిర్యాదు

విజయవాడ, మార్చి 23: దెయ్యాలకుంటపల్లి గ్రామ సర్పంచ్ సద్దా రమేష్‌పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. గ్రామ టిడిపి నాయకుడు పెద్దప్ప, ఎంపీడీవో సాల్మన్ రాజుకు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం… సర్పంచ్ రమేష్ తన బావమరిది చరణ్ సాయి, ఎంపీటీసీ శివారెడ్డి పేర్లతో పంచాయతీ నిధులను అక్రమంగా డ్రా చేసినట్లు ఆరోపించారు. గ్రామ అభివృద్ధి పనుల కోసం విడుదలైన నిధులను దుర్వినియోగం చేశారని తెలిపారు.

చరణ్ సాయి విజయవాడలో ఉన్నప్పటికీ, అతని ఖాతాకు అభివృద్ధి పనుల పేరుతో నిధులు బదిలీ చేసినట్లు పేర్కొన్నారు. పైపులైన్లు వేయకపోయినా వేసినట్లు, కాలువలు శుభ్రం చేయకపోయినా చేసినట్లు చూపించి భారీగా నిధులు డ్రా చేసినట్లు ఆరోపించారు.

అలాగే, స్వచ్ఛ భారత్ షెడ్డు గత టిడిపి ప్రభుత్వ కాలంలో నిర్మించబడినప్పటికీ, మరమ్మత్తులు చేసినట్లు చూపించి ఎంపీటీసీ శివారెడ్డి పేరుతో నిధులు తీసుకున్నారని తెలిపారు. మొత్తం మీద సుమారు రూ.15 లక్షలకు పైగా పంచాయతీ నిధులు అక్రమంగా మళ్లించారని ఆరోపించారు.

ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పెద్దప్ప డిమాండ్ చేశారు.