BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 18 March 2026, 05:22 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

డిపాజిట్ డబ్బులు అడిగితే దాడి – లింగపాలెంలో ఘరానా మోసం ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Mar, 2026 - 05:22 PM
212 వీక్షణలు
డిపాజిట్ డబ్బులు అడిగితే దాడి – లింగపాలెంలో ఘరానా మోసం ఆరోపణలు

ఏలూరు జిల్లా, చింతలపూడి నియోజకవర్గం, లింగపాలెం మండలంలో ఘరానా మోసం ఘటన వెలుగులోకి వచ్చింది. తోచిలక రాయుడుపాలెం గ్రామానికి చెందిన రెడ్డి వెంకటేశ్వరరావు (రాజు) కుటుంబానికి చెందిన పెద్దపులి లక్ష్మీ ఫిర్యాదు మేరకు ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే… లింగపాలెం గ్రామంలో ఉన్న “శ్రీ సాయిరాం ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్” ప్రొప్రైటర్ బేతిన నాగ వెంకట మధుకు తమ కుటుంబం కొన్ని సంవత్సరాల క్రితం వ్యాపార అభివృద్ధి కోసం లక్షల రూపాయలు డిపాజిట్‌గా ఇచ్చినట్లు బాధితులు తెలిపారు. అయితే ప్రస్తుతం కుటుంబ ఆర్థిక అవసరాల నిమిత్తం డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా, సంబంధిత వ్యక్తి నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఆరోపించారు.
అదే సమయంలో డబ్బులు అడిగినందుకు దుర్భాషలాడటమే కాకుండా, మహిళలపై కూడా అనుచితంగా ప్రవర్తిస్తూ దాడికి పాల్పడ్డారని బాధితులు వాపోయారు. “నీకు దిక్కున కాడ చెప్పుకో” అంటూ బెదిరిస్తూ బయటకు నెట్టివేసి, తమపై చేయి చేసుకున్నారని తెలిపారు.
ఈ ఘటనపై లింగపాలెం మండల కాపు సంఘం నాయకులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులు వెల్లడించారు. సంఘం నాయకులు స్పందిస్తూ, కష్టపడి సంపాదించిన డబ్బులు తిరిగి అడిగినందుకు మహిళలపై దాడి చేయడం తీవ్రంగా ఖండనీయమని పేర్కొన్నారు. తక్షణమే న్యాయం చేయకపోతే మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పోరాటం చేపడతామని హెచ్చరించారు.
ఈ ఘటనతో మండలంలో ఉద్రిక్తత నెలకొంది.