BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 26 June 2026, 10:38 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

దొండపూడి 'నిత్య పెళ్లికూతురు' అరెస్ట్.. ఐదు పెళ్లిళ్లు చేసి పలువురికి టోకరా!

ఆంధ్రప్రదేశ్
/ అనంతపురం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jun, 2026 - 10:38 PM
117 వీక్షణలు

పశ్చిమగోదావరి జిల్లా దొండపూడికి చెందిన వజ్రపు మణి అలియాస్ శ్వేతారెడ్డి అలియాస్ కీర్తి (27)ను అనంతపురం జిల్లా పెద్దవడుగూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకరికి తెలియకుండా మరొకరిని వివాహం చేసుకుంటూ పలువురిని మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసుల వివరాల ప్రకారం, విజయవాడకు చెందిన కొందరు మధ్యవర్తులతో కలిసి ఎదురుకట్నం వచ్చేలా పెళ్లి సంబంధాలు కుదుర్చుకుని, వివాహం అనంతరం కొద్ది రోజులే భర్త వద్ద ఉండి స్వస్థలానికి వెళ్లిపోయేదని వెల్లడించారు. ఇదే తరహాలో మొత్తం ఐదు వివాహాలు చేసినట్లు విచారణలో తేలినట్లు సమాచారం.

2025లో పెద్దవడుగూరు మండలం కాసేపల్లికి చెందిన యాపర్ల సుధీర్‌రెడ్డిని వివాహం చేసుకున్న ఆమె, కొద్దిరోజులకే చెప్పకుండా వెళ్లిపోవడంతో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

ఇటీవల కర్ణాటకలోని మల్లెకుప్పానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుని ఆరు రోజులకే మదనపల్లె వెళ్తుండగా చీలకబైలు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసులో మరిన్ని వివరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.