BREAKING
thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి
Date of Publish : 28 June 2026, 03:34 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

Drainage Issue: జనార్ధనవరం ఎస్సీ కాలనీలో తీవ్ర డ్రైనేజీ సమస్య.. నిల్వ నీటితో ప్రజల అవస్థలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Jun, 2026 - 03:34 PM
136 వీక్షణలు
ఏలూరు జిల్లా, చాట్రాయి మండలం, జనార్ధనవరం | NTODAY NEWS
ఏలూరు జిల్లా చాట్రాయి మండలం జనార్ధనవరం గ్రామంలోని ఎస్సీ కాలనీ మాలపల్లిలో డ్రైనేజీ సమస్య తీవ్రరూపం దాల్చింది. డ్రైనేజీలోకి వర్షపు నీరు వెళ్లకుండా దిగువ ప్రాంతంలోని కొంతమంది రైతులు అడ్డుకట్ట వేయడంతో వర్షపు నీరు సిమెంట్ రోడ్డుపై నిలిచిపోయి కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రోడ్డుపై నిల్వ ఉన్న నీటి కారణంగా ఇళ్లలోకి వెళ్లాలంటే బురదలో నుంచి నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే మార్గంలో ప్రతిరోజూ సుమారు 20 మంది విద్యార్థులు పాఠశాలకు వెళ్లాల్సి వస్తోందని, వారు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
వర్షాకాలం నేపథ్యంలో నిల్వ నీటితో దోమలు విపరీతంగా పెరిగి జ్వరాలు విజృంభిస్తున్నాయని, ఇప్పటికే కొంతమంది అనారోగ్యానికి గురయ్యారని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమస్యపై పంచాయతీ కార్యదర్శిని సంప్రదించగా, ప్రస్తుతం ఎన్నికల విధుల్లో ఉన్న కారణంగా వెంటనే చర్యలు తీసుకోవడం సాధ్యం కాదని చెప్పినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.
తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, కాలనీలో నిల్వ ఉన్న నీటిని తొలగించి ప్రజలను అంటువ్యాధుల బారిన పడకుండా చర్యలు చేపట్టాలని జనార్ధనవరం మాలపల్లి వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.