BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 02 July 2026, 06:21 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

దుమ్ముగూడెంలో పశువుల అక్రమ రవాణా భగ్నం.. ముగ్గురు అరెస్ట్

తెలంగాణ
/ భద్రాద్రి కొత్తగూడెం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jul, 2026 - 06:21 PM
108 వీక్షణలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం ములకపాడు కూడలి వద్ద పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో పశువుల అక్రమ రవాణా వ్యవహారం వెలుగుచూసింది. గురువారం తనిఖీలు చేపట్టిన పోలీసులకు నంబర్‌ప్లేట్ లేని ఓ వాహనం అనుమానాస్పదంగా కనిపించడంతో ఆపి తనిఖీ చేశారు.

వాహనంలో 12 పశువులను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. చర్ల ప్రాంతం నుంచి పండితాపురం వైపు పశువులను తీసుకెళ్తున్నట్లు విచారణలో తేలింది. వెంటనే పశువులను స్వాధీనం చేసుకుని వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు, ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.

ఈ కేసులో పాల్వంచకు చెందిన షేక్ కాశీం, షేక్ హన్ను, వాహన డ్రైవర్ వంశీలను అరెస్ట్ చేసినట్లు ఎస్సై శ్యాంప్రసాద్ వెల్లడించారు. పశువుల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నామని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.