BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 03 June 2026, 07:46 pm
Posted by : V శ్రీనివాస్

​ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి: కలెక్టర్ కుమార్ దీపక్

తెలంగాణ
/ మంచిర్యాల / జైపూర్
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
03 Jun, 2026 - 07:46 PM
184 వీక్షణలు

రైస్ మిల్లులు, కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ కుమార్ దీపక

రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన జైపూర్ మండలంలోని బెజ్జాల, కిష్టాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను, ఓం, అన్నపూర్ణ రైస్ మిల్లులను, అలాగే సుముఖ గోదామును తహసిల్దార్ వనజా రెడ్డితో కలిసి సందర్శించి నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ ఏడాది జిల్లాలో దాదాపు 1.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసే అవకాశం ఉందని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. అలాగే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సుమారు 10 వేల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను కూడా కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

​హమాలీల కొరతను అధిగమించేందుకు స్థానికులను వినియోగిస్తూ ఎగుమతి, దిగుమతులను వేగవంతం చేశామని కలెక్టర్ వివరించారు. అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం పాడవకుండా భద్రపరిచేందుకు పెద్దపల్లి, కరీంనగర్‌లలో రెండు గోదాములను సిద్ధం చేశామని, రవాణా కోసం ట్రాక్టర్లను సైతం వాడుకునేలా ప్రభుత్వం వీలు కల్పించిందని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల నుండి మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలని, అధికారులు పరస్పర సమన్వయంతో వ్యవహరిస్తూ నిర్దేశిత సీఎంఆర్ (CMR) లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మిల్లర్లను, అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో సంబంధిత అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు