BREAKING
thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్
Date of Publish : 23 May 2026, 07:46 pm
Posted by : V శ్రీనివాస్

ధాన్యపు నిల్వల ప్రక్రియ వేగవంతం చేయాలి: కలెక్టర్ కుమార్ దీపక్

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
23 May, 2026 - 07:46 PM
141 వీక్షణలు

కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యపు రవాణా, నిల్వ ప్రక్రియను ఎలాంటి లోపాలు లేకుండా పక్కాగా, వేగవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన బెల్లంపల్లిలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదామును సబ్ కలెక్టర్ మనోజ్, తహసీల్దార్ కృష్ణలతో కలిసి ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా గోదాముల్లో ధాన్యానికి సంబంధించిన ఏర్పాట్లను స్వయంగా తనిఖీ చేసిన కలెక్టర్, కొనుగోలు కేంద్రాల నుండి వచ్చే లోడ్‌లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.

​మార్కెట్ గోదాముల్లో పక్కాగా ధాన్యం భద్రత ఏర్పాట్లు

​గోదాములకు వచ్చే ధాన్యం లారీలను ఏమాత్రం ఆలస్యం చేయకుండా, త్వరగా దిగుమతి (అన్‌లోడింగ్) చేసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. మిల్లులు, గోదాముల వద్ద రవాణా వాహనాలు నిలిచిపోకుండా అధికారులు సమన్వయంతో వ్యవహరించాలన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యాన్ని భద్రపరిచేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, నిల్వ ప్రక్రియలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో స్థానిక రెవెన్యూ, మార్కెటింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు