BREAKING
thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్
Date of Publish : 08 March 2026, 01:01 am
Posted by : NTODAY NEWS OFFICIAL

గ్రామాలకు నిత్యవసర సరుకుల పంపిణీ

తెలంగాణ
08 Mar, 2026 - 01:01 AM
315 వీక్షణలు
స్వచ్ఛ రథాల ద్వారా గ్రామాలకు నిత్యవసర సరుకుల పంపిణీ NTODAY NEWS: శ్రీశైలం, నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున గ్రామీణ ప్రాంత ప్రజలకు నిత్యవసర సరుకులు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన స్వచ్ఛ రథాల సేవలు అభినందనీయమని టీడీపీ మండల సీనియర్ నాయకులు శివ ప్రసాద్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆత్మకూరు పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో స్వచ్ఛ రథాల సేవలను ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని మండల ఎంపీపీ నల్ల కాలువ తిరుపాలమ్మ, ఎంపీడీవో నాగేంద్రుడు, డిప్యూటీ ఎంపీడీవో బాలు నాయక్, ఏవో సయ్యద్ ఉమ్మర్ భాష ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి సహకారంతో గ్రామీణ ప్రాంత ప్రజలకు స్వచ్ఛ రథాల ద్వారా నిత్యవసర సరుకులు మరియు వివిధ రకాల కూరగాయలు అందించే విధంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందని తెలిపారు. గ్రామస్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వసతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి జరుగుతోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డికు గ్రామీణ ప్రాంత ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్ధపల్లె మాజీ సర్పంచ్ గంగాధర్ రెడ్డి, పంచాయతీ డెవలప్మెంట్ అధికారి ప్రభాకర్, ఐటీడీఏ ఏపీవో నాగార్జున, బందెల నాగన్నతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరియు అధికారులు పాల్గొన్నారు. #Srisailam #SwachhaRatham #TDP #BuddaRajashekarReddy #ChandrababuNaidu #PawanKalyan #AndhraPradeshNews #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube