BREAKING
thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
Date of Publish : 02 January 2026, 04:05 am
Posted by : NTODAY NEWS OFFICIAL

రైతులకు నూతన పాస్ పుస్తకాల పంపిణీ

తెలంగాణ
02 Jan, 2026 - 04:05 AM
437 వీక్షణలు

రైతులు నూతన పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నాయకులు చిట్టా మధు

NTODAY NEWS: గొల్లప్రోలు మండల  రిపోర్టర్ బోర శివారెడ్డి కాకినాడ జిల్లా గొల్లప్రోలు పరిధిలోని పలు సచివాలయాల్లో శుక్రవారం నిర్వహించిన రైతులు నూతన పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు చిట్టా మధు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైసీపీ పాలనలో జరిగిన తప్పిదాల వల్ల రెవెన్యూ సంబంధిత లక్షలాది సమస్యలు వెలుగులోకి వచ్చాయని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు.,వైసీపీ పాలన కారణంగా రెవెన్యూ సమస్యలు అత్యంత సంక్లిష్టంగా మారాయని, సామాన్య ప్రజల భూ రికార్డులు తారుమారు కావడంతో నేటికీ అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. గత ప్రభుత్వం పాస్ పుస్తకాల పంపిణీ, సర్వేల పేరుతో అనేక అవకతవకలకు పాల్పడిందని విమర్శించారు. తాతలు, ముత్తాతల నుంచి వారసత్వంగా వస్తున్న ఆస్తులపై ప్రజల హక్కులను కాలరాసేలా వ్యవహరించారని, రాజముద్రతో ఇవ్వాల్సిన పట్టాదారు పాస్ పుస్తకాలను పార్టీ రంగులు, వ్యక్తిగత ఫోటోలతో జారీ చేసి రైతుల హక్కులను హరించారని ఆరోపించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా రైతుల ఆస్తులపై హక్కులను కబ్జా చేయాలన్న ప్రయత్నాన్ని ప్రజలు మరిచిపోలేదని తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేసిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగు దేశం, బీజేపీ నాయకులు కడారి తమ్మయ నాయుడు, పర్ల శేషయ్య, కొశిరెడ్డి సోంబాబు, పెద్దిశెట్టి అర్జున్, మేడసాని కామరాజు, నందిపు రామకృష్ణ, మురాలశెట్టి సందీప్ తదితర నాయకులు, రైతులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube