BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 06 March 2026, 04:59 am
Posted by : NTODAY NEWS OFFICIAL

చిన్నారికి అన్నప్రాశనం చేసిన జిల్లా కలెక్టర్

తెలంగాణ
06 Mar, 2026 - 04:59 AM
231 వీక్షణలు
అంగన్‌వాడి కేంద్రంలో చిన్నారికి అన్నప్రాశనం చేసిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి NTODAY NEWS: బొమ్మలరామారం ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం మైసిరెడ్డిపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయాన్ని పరిశీలించి గ్రామంలో జరుగుతున్న పరిశుభ్రత కార్యక్రమాలను సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలోని మురికి కాల్వలను శుభ్రం చేయాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పరిశుభ్రత మరియు పారిశుధ్య కార్యక్రమాలను ప్రతి గ్రామంలో సమర్థవంతంగా అమలు చేసి గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. అనంతరం గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పనులను పరిశీలించిన కలెక్టర్, వివిధ దశల్లో ఉన్న ఇండ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి ఉగాది పండుగ నాటికి గృహప్రవేశాలు నిర్వహించాలని లబ్ధిదారులకు సూచించారు. తదుపరి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మరియు అంగన్‌వాడి కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారో తెలుసుకుని విద్యార్థులతో ముచ్చటిస్తూ వారు ఏ తరగతిలో చదువుతున్నారో అడిగి తెలుసుకున్నారు. అంగన్‌వాడి కేంద్రంలో రోజూ ఎంతమంది పిల్లలు హాజరవుతున్నారో, ఈ రోజు ఎన్ని మంది వచ్చారో వివరాలు తెలుసుకున్నారు. అలాగే గర్భిణీ స్త్రీలు మరియు బాలింతలు ఎంతమంది ఉన్నారో అడిగి తెలుసుకున్నారు. గర్భిణీ స్త్రీలు ప్రతిరోజూ అంగన్‌వాడి కేంద్రానికి వచ్చి పోషకాహారం తీసుకుంటున్నారా, ప్రతి నెల వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారా అని విచారించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడి కేంద్రంలో ఉన్న చిన్నారికి జిల్లా కలెక్టర్ అన్నప్రాశనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, మైసిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ నోముల రాంరెడ్డి మరియు ఇతరులు పాల్గొన్నారు. #Bommalaramaram #Maisireddipalli #AnuragJayanti #Anganwadi #PrajaPalana #TelanganaNews #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube