BREAKING
thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్
Date of Publish : 08 August 2025, 06:43 am
Posted by : NTODAY NEWS OFFICIAL

భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) 16వ డివిజన్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా సదస్సు

తెలంగాణ
08 Aug, 2025 - 06:43 AM
417 వీక్షణలు
జిల్లా సదస్సును జయప్రదం చేయండి, ఏలూరు ఏరియా కార్యవర్గ సభ్యురాలు కొల్లూరి సుధారాణి. NTODAY NEWS: ఏలూరు భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) 16వ డివిజన్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా సదస్సు జయప్రదం చేయాలని సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఏరియా కార్యవర్గ సభ్యురాలు కొల్లూరి సుధారాణి మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాగా ఆంధ్ర రాష్ట్ర ధాన్యగారంగా పిలవబడిన పశ్చిమ గోదావరి జిల్లా 2022 ఏప్రిల్ నెలలో ఏలూరు జిల్లాగా ఏర్పడిన నాటి నుండి అభివృద్ధికి దూరమైందని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు మారినా ఏలూరు జిల్లా అభివృద్ధి చెందలేదని విమర్శించారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనలో ప్రభుత్వం విఫలమయిందని విమర్శించారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ఏలూరు జిల్లాలో నెలకొల్పడం ద్వారా జిల్లా అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏలూరు నగరంలో వేలాది మందికి ఉపాధి కల్పించిన జూట్ మిల్లులను అకారణంగా మూసివేయడం ద్వారా అనేకమంది ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఏలూరు నగరంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఇక్కడ నివసించే వారికి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లా సమగ్రాభివృద్ధి అంశాలపై రేపు భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ)ఆధ్వర్యంలో ఆర్.ఆర్.పేట, స్ఫూర్తి భవన్ నందు జరుగుతున్న జిల్లా సమగ్ర అభివృద్ధి సదస్సులో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సదస్సు కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సమావేశంలో కొండేటి మేరీ, జయలక్ష్మి, ఉప్పులూరి లక్ష్మి, జ్యోతి, మేరీ, పంతం సుందరమ్మ, ప్రభావతి, జ్యోతి, విజయకుమారి, భవాని తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube