BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 16 January 2026, 09:23 am
Posted by : NTODAY NEWS OFFICIAL

వైద్యులు బాధ్యతతో విధులు నిర్వహించాలి

తెలంగాణ
16 Jan, 2026 - 09:23 AM
189 వీక్షణలు

వైద్యులు బాధ్యతతో విధులు నిర్వహించాలి

-యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు NTODAY NEWS:  ఆలేరు మండలం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు నాణ్యమైన వైద్యం అందించడంలో వైద్యులు, సిబ్బంది పూర్తి బాధ్యతతో విధులు నిర్వహించాలి అని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శుక్రవారం ఆలేరు పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది హాజరు రిజిస్టర్, మందుల లభ్యత తదితర అంశాలను పరిశీలించారు. కలెక్టర్ తనిఖీ ముఖ్యాంశాలు: ప్రతిరోజూ ఓపీ విభాగానికి వచ్చే రోగుల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. గర్భిణీ స్త్రీలు చెకప్‌కు ఎంతమంది వస్తున్నారని, ప్రతి నెల ఎన్ని డెలివరీలు జరుగుతున్నాయని విచారించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ప్రసవాల సంఖ్య పెరగాలి అని సూచించారు. ఆశా కార్యకర్తలు గర్భిణీలతో నిరంతరం ఫోన్ ద్వారా సంప్రదించి, వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని పరీక్షలు అందుబాటులో ఉన్నాయని తెలియజేయాలని ఆదేశించారు. రోగులతో ప్రత్యక్ష సంభాషణ: ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో కలెక్టర్ నేరుగా మాట్లాడి, వారికి అందుతున్న వైద్య సేవలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. డాక్టర్లు సమయానికి విధులకు హాజరవుతున్నారా లేదా అని అడిగి నిర్ధారించారు. ఇతర సూచనలు: ఆసుపత్రిలో మధ్యాహ్న భోజనం అందిస్తున్నారా? భోజనం నాణ్యత ఎలా ఉందని ఆరా తీశారు. మందుల కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. #PublicHealthcare #HospitalInspection #QualityMedicalCare #YadadriBhuvanagiri #Aleru #GovernmentHospital #HealthcareServices Follow us on Website Facebook Instagram YouTube