BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 18 May 2026, 06:19 pm
Posted by : V శ్రీనివాస్

​ఈ నెల 20న మెడికల్ బంద్: కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన అసోసియేషన్

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
18 May, 2026 - 06:19 PM
151 వీక్షణలు

​మంచిర్యాల :- ఆన్‌లైన్ ఫార్మసీల ద్వారా ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల విక్రయాలను నిరసిస్తూ, ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్త మెడికల్ షాపుల బంద్‌కు పిలుపునిచ్చినట్లు మంచిర్యాల జిల్లా మెడికల్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్‌ను కలిసి ఒక వినతిపత్రాన్ని అందజేశారు.

​ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు చంద్రశేఖర్ మరియు సుధాకర్ మాట్లాడుతూ, నిబంధనలకు విరుద్ధంగా ఆన్‌లైన్ ఫార్మసీల ద్వారా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తుండటంతో యువత పెడదోవ పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందని అన్నారు.

​కార్పొరేట్ సంస్థల ఆన్‌లైన్ వ్యాపార శైలిని నిరసిస్తూ ఈ నెల 20న జిల్లావ్యాప్తంగా మెడికల్ షాపులను పూర్తిగా మూసివేసి బంద్‌ను పాటించనున్నట్లు వారు స్పష్టం చేశారు. అయితే, ప్రజల అత్యవసర ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని అత్యవసర సేవలు (Emergency Services) మాత్రం అందుబాటులో ఉంటాయని వారు కలెక్టర్‌కు వివరించారు.