BREAKING
ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ
Date of Publish : 10 September 2026, 09:50 pm
Posted by : SEETHA KIRAN KUMAR

ఈనెల 17 న పబ్లిక్ గార్డెన్ లో ఘనంగా ప్రజా పాలనా దినోత్సవం

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
10 Sep, 2026 - 09:50 PM
5 వీక్షణలు

ఈనెల 17 న పబ్లిక్ గార్డెన్ లో ఘనంగా ప్రజా పాలనా దినోత్సవం

ఈనెల 17 వతేదీన నాంపల్లి లోని పబ్లిక్ గార్డెన్ లో నిర్వహించే తెలంగాణా ప్రజా పాలన దినోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు. ప్రజాపాలన దినోత్సవం నిర్వహణా ఏర్పాట్లపై గురువారం డా.బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు జయేష్ రంజన్, వికాస్ రాజ్, అహ్మద్ నదీమ్, ముఖ్య కార్యదర్శులు నవీన్ మిట్టల్, క్రిస్టినా చొంగ్తూ, శిఖా గోయల్, హైదాబాద్ సి.పీ సజ్జనార్, ఆర్టీసీ ఎండి నాగి రెడ్డి, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ ముకుంద రెడ్డి తదితర సీనియర్ అధికారులు హాజయ్యారు. 


ఈ సందర్భంగా సి.ఎస్ మాట్లాడుతూ, ప్రజా పాలనా దినోత్సవాన్ని పబ్లిక్ గార్డెన్ లో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 17 న ఉదయం అసెంబ్లీ ఎదురుగా గల అమరవీరుల స్థూపం వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి నివాళులు అర్పించిన అనంతరం పబ్లిక్ గార్డెన్ కు వస్తారని తెలిపారు. ఈ సందర్భంగా అమరవీరుల స్థూపంవద్ద, పబ్లిక్ గార్డెన్ లో సంబంధిత అధికారులు తగు ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. నగరంలోని పలు ప్రధాన భవనాలకు , చారిత్రక కట్టడాలకు విద్యుత్ దీపాల అలంకరణ చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వహణ కు గానూ ఈనెల 15 న పూర్తి డ్రెస్ రిహార్సల్స్ ను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ప్రజాపాలన దినోత్సవానికి వేయి మంది స్వయం సహాయక మహిళలతో పాటు రెండు వేల మంది హాజరవుతారని పేర్కొన్నారు.