BREAKING
పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్ట్.. UPDATE పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్ట్.. UPDATE
Date of Publish : 05 September 2026, 03:59 pm
Posted by : SEETHA KIRAN KUMAR

ప్రతి నీటిబొట్టు అమృతమే.. నీటి పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
05 Sep, 2026 - 03:59 PM
6 వీక్షణలు

తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో నీటి వినియోగంపై అప్రమత్తత అవసరం

నెల్లూరు | Ntoday News

రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రతి నీటిబొట్టును పొదుపుగా వినియోగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షపాతం లోటు ఏర్పడిందని, ఇలాంటి పరిస్థితుల్లో నీటి వనరుల పరిరక్షణకు ప్రభుత్వం, అధికారులు, రైతులు, ప్రజలు సమిష్టిగా బాధ్యత తీసుకోవాలని సూచించారు.

వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఎల్‌నినో ప్రభావం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారని తెలిపారు. దీంతో అందుబాటులో ఉన్న నీటి వనరులను జాగ్రత్తగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ఇరిగేషన్‌, వ్యవసాయ శాఖ అధికారులు ప్రతి నీటిబొట్టును పర్యవేక్షించాలని సూచించారు. రైతులతో పాటు సాధారణ పౌరులు కూడా నీటిని అత్యంత పొదుపుగా వినియోగించాలని, ప్రస్తుత పరిస్థితులను ప్రభుత్వ బాధ్యతగా మాత్రమే కాకుండా ప్రతి వ్యక్తి బాధ్యతగా భావించాలని కోరారు.

గత అనుభవాలతో నీటి పొదుపు

2002–03లో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు నెల్లూరు జిల్లాలో చేపట్టిన చర్యలను ఈ సందర్భంగా గుర్తుచేశారు. సీపీఎం సీనియర్ నాయకుడు దివంగత జక్కా వెంకయ్య, అప్పటి ఇరిగేషన్‌ చీఫ్ ఇంజినీర్‌ రామిరెడ్డి మార్గదర్శకంలో ఒక టీఎంసీ నీటితో సుమారు 15 వేల ఎకరాల పంటను కాపాడినట్లు తెలిపారు.

అప్పట్లో జిల్లా స్థాయి అధికారులను ఒక్కో కాలువ పర్యవేక్షణకు ప్రత్యేకంగా నియమించి, జెడ్పీ సీఈఓ, డీపీఓ, డీఆర్డీఏ పీడీ, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ తదితర అధికారుల సమన్వయంతో నీటి వినియోగాన్ని పర్యవేక్షించినట్లు పేర్కొన్నారు.

తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలోని పంటలను కాపాడిన ఆ అనుభవాన్ని ప్రస్తుత పరిస్థితుల్లోనూ అనుసరించాల్సిన అవసరం ఉందని సూచించారు.

“ప్రతి నీటిబొట్టు అమృతంతో సమానం.. నీటి పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత” అనే భావనతో నీటి వినియోగంలో ప్రజలందరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.