BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 22 March 2026, 07:15 am
Posted by : కూనురు మధు

ఎమ్మెల్యే వేముల వీరేశానికి సర్పంచుల ఫోరం ఘన సన్మానం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
22 Mar, 2026 - 07:15 AM
281 వీక్షణలు

ఎమ్మెల్యే వేముల వీరేశానికి సర్పంచుల ఫోరం ఘన సన్మానం  

నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం ప్రభుత్వ విప్ హోదా దక్కడం పట్ల చిట్యాల మండల సర్పంచుల ఫోరం హర్షం వ్యక్తం చేశారు. శనివారం మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు కాటం వెంకటేశం నేతృత్వంలో  సర్పంచుల ఫోరం  బృందం ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే వేముల వీరేశం కు  కీలకమైన విప్ పదవి దక్కడం పట్ల చిట్యాల మండలం సర్పంచులు సంతోషం వ్యక్తం చేశారు. నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషికి ఈ పదవి దక్కిన గౌరవమని అన్నారు. సమావేశంలో చిట్యాల మండలంలోని పలు గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనుల గురించి సర్పంచులు చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశంచిట్యాల అభివృద్ధికి తన వంతు పూర్తి సహకారం ఉంటుందని, నిధుల మంజూరులో ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చారు.​ఈ కార్యక్రమంలో మిరియాల వెంకటేశం, ​ఆవుల సుందర్, ​ఆవుల సునీత యాదయ్య , ​కట్ట ఆశయ్య, ​జోగు సురేష్ , ​సాగర్ల యాదమ్మ  యాదయ్య , ​సాగర్ల భాను శ్రీ బిక్షమయ్య  ​మేడి శ్రీలత శ్రీను , కోన్ రెడ్డి​ ,మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.