BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 25 March 2026, 07:56 am
Posted by : ఇప్పలపల్లి నరేందర్

పెండింగ్ లో ఉన్న పనులపై అదనపు కలెక్టర్ సమీక్ష సమావేశం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
25 Mar, 2026 - 07:56 AM
181 వీక్షణలు

ఎన్ఆర్ఈజీఎస్ కింద పెండింగ్ లో ఉన్న పనులపై అదనపు కలెక్టర్ సమీక్ష సమావేశం

(NREGS) పెండింగ్ పనులను నిర్దిష్ట గడుపులోగా పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం రోజున గుండాల మండలంలోని ఎంపిడిఓ కార్యాలయంలో NREGS కింద పెండింగ్‌లో ఉన్న పనుల పై  అదనపు కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ...NREGS పనులను వేగవంతంగా పూర్తి చేసి గ్రామీణ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ పనులను నిర్దిష్ట గడువులోపు పూర్తి చేయాలని, పనుల నాణ్యతలో ఎలాంటి రాజీ పడకూడదని సూచించారు.మండలంలోని అన్ని గ్రామాల్లో చేపట్టిన పనుల పురోగతిని సమీక్షిస్తూ, పనుల అమలులో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకొని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.అనంతరం గుండాల మండల పంచాయితీ కార్యాలయంలో గ్రామాల వారీగా పన్నుల వసూళ్లపై అదనపు కలెక్టర్ సంబంధిత అధికారులతో  సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడుతూ గ్రామంలో ఇప్పటివరకు ఎంత మేరకు పన్నులు వసూలు అయ్యాయని, ప్రతి గ్రామానికి నిర్దేశించిన లక్ష్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పన్నుల వసూళ్లు వేగంగా చేయాలని స్పష్టం చేశారు.అలాగే పంచాయితీ సిబ్బందికి జీతాలు సమయానికి చెల్లింపులు జరుగుతున్నాయా అని ఆరా తీశారు. జీతాల చెల్లింపులో ఎలాంటి ఆలస్యం ఉండకూడదని ఆదేశించారు.గ్రామాల్లో అంగన్వాడీ భవనాల నిర్మాణ పనుల పురోగతిని గురించి అడిగి తెలుసుకొని, పనులు వెంటనే  నిర్ణీత గడువులోగా నాణ్యతతో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు అనంతరం అదనపు కలెక్టర్ గుండాల గ్రామపంచాయతీలోని నర్సరీని సందర్శించి అక్కడ మొక్కల పెంపకం మరియు సంరక్షణ గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మొక్కలను సక్రమంగా పెంచి గ్రామాలలో ఉచితంగా నాటే కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు.పర్యావరణ పరిరక్షణలో మొక్కల పెంపకం కీలక పాత్ర పోషిస్తుందని, ప్రతి ఒక్కరూ చెట్లను నాటడంతో పాటు వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ఉందన్నారు.ఈ సమావేశంలో ఎంపిడిఓ, సంబంధిత శాఖల అధికారులు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.