BREAKING
thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు
Date of Publish : 19 August 2026, 09:45 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఎన్నికల ఏర్పాట్లు వేగవంతం.. సామాజిక వర్గాల సర్వేపై అధికారుల దృష్టి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Aug, 2026 - 09:45 PM
61 వీక్షణలు

ఎన్నికల ఏర్పాట్లు వేగవంతం.. సామాజిక వర్గాల సర్వేపై అధికారుల దృష్టి

ప్రతి ఇంటికీ వెళ్లి ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా వివరాలు సేకరించాలి

తిరువూరు ఎంపీడీవో రవిబాబు ఆదేశాలు

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికారులు ముందస్తు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఎన్నికల ప్రక్రియకు అవసరమైన చర్యలపై దృష్టి సారించిన అధికారులు క్షేత్రస్థాయిలో సర్వేలు, సమాచార సేకరణ చేపడుతున్నారు.

తిరువూరు మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో రవిబాబు పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ముందస్తు ఏర్పాట్లపై కార్యదర్శులకు పలు సూచనలు చేశారు.

గ్రామాల్లో చేపట్టనున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా సర్వేను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి ఇంటికీ వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలను క్షుణ్ణంగా సేకరించాలని సూచించారు.

వివరాల నమోదు సమయంలో ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, క్షేత్రస్థాయిలో సేకరించిన సమాచారాన్ని పూర్తిస్థాయిలో పరిశీలించి సకాలంలో ఉన్నతాధికారులకు అందజేయాలని తెలిపారు.

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పంచాయతీ కార్యదర్శుల బాధ్యతలు, చేపట్టాల్సిన చర్యలపై ఎంపీడీవో అవగాహన కల్పించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఇప్పటి నుంచే సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో తిరువూరు మండలంలోని పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.