BREAKING
thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య గారి ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య గారి ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు
Date of Publish : 30 April 2026, 06:31 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీపై ఏ.కొండూరు ఎంపీడీవో కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 06:31 PM
160 వీక్షణలు

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీపై ఏ.కొండూరు ఎంపీడీవో కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఏ కొండూరు మండలంలోని 21 గ్రామపంచాయతీల పరిధిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీని సమయానికి పూర్తి చేయాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి బొజ్జగాని శ్రీనివాసరావు అధికారులకు ఆదేశించారు. గురువారం మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం నుంచి పంచాయతీ కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి నెల మాదిరిగానే ఉదయం 6 గంటల నుంచి 9 గంటలలోపు లబ్ధిదారులందరికీ పెన్షన్ సొమ్ము అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పెన్షన్ నగదును అత్యంత జాగ్రత్తగా నిర్వహిస్తూ, లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పంపిణీ చేయాలని తెలిపారు.

గ్రామాల్లో లబ్ధిదారులు ఎవరైనా అందుబాటులో లేకపోతే ముందస్తుగా సమాచారం ఇచ్చి, వారికి అసౌకర్యం కలగకుండా చూడాలని పేర్కొన్నారు. పెన్షన్ల పంపిణీ విషయంలో ఎటువంటి అలసత్వం ప్రదర్శించకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.