BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 24 March 2026, 09:57 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

న్యాయ వ్యవస్థపై అవగాహన సదస్సు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Mar, 2026 - 09:57 PM
190 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట: న్యాయ వ్యవస్థపై అవగాహన సదస్సు

విస్సన్నపేట మండలం, నూతిపాడు గ్రామంలో న్యాయ వ్యవస్థపై అవగాహన సదస్సు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి డి.ఎల్.ఎస్.ఏ సెక్రెటరీ కేవీ. రామకృష్ణయ్య మరియు డాక్టర్ బి.కీర్తి, వాసవ్య మహిళా మండలి అధ్యక్షురాలు ముఖ్యఅతిథులుగా విచ్చేశారు. కీర్తి మాట్లాడుతూ, గ్రామంలో బాల్య వివాహాలు మరియు ఆడపిల్లలపై అసభ్య ప్రవర్తన ఎక్కువగా జరుగుతున్నందున ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయబడిందని తెలిపారు. ఆమె అన్నారు, “మనమందరం కలిసికట్టుగా ఉంటే ఏ చిన్న సమస్య అయినా సులభంగా ఎదుర్కోవచ్చు. గ్రామంలోని మహిళలు చదువులు చదివి చైతన్యవంతులు కావాలి.” గ్రామ పంచాయతీ సర్పంచ్ విజయకుమార్ బాల్య వివాహాలు జరగకుండా ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలి అని అన్నారు. విస్సన్నపేట ఎస్ఐ అర్జున్ రాజు గ్రామస్తులను కోరుతూ, పిల్లలకు ఫోన్లు ఇవ్వడం ద్వారా వారి భవిష్యత్తు నాశనం చేయకుండా జాగ్రత్తగా గమనించాలి అన్నారు. డిస్ట్రిక్ట్ సివిల్ జడ్జి కేవీ. రామకృష్ణయ్య మాట్లాడుతూ, బాల్య వివాహాల వల్ల పిల్లలు ఎదుర్కొనే సమస్యలు, భవిష్యత్తుపై ప్రభావం గురించి వివరించారు. తల్లిదండ్రులు, గ్రామస్తులు బాల్యవివాహాలపై అవగాహన కలిగి ఉండాలి అని గుర్తుచేశారు. బాల్య వివాహం జరిగితే ఒక సంవత్సరం జైలు శిక్ష మరియు రెండు లక్షల రూపాయల జరిమానా విధించబడుతుంది. పిల్లల ప్రవర్తనను గమనిస్తూ, ఒక కుటుంబం, ఒక ఊరు, ఒక మండలానికి చెడ్డ పేరు రావకుండా చూడాలి. 18 సంవత్సరాల లోపు బాలికలు, 21 సంవత్సరాల లోపు బాలురు వివాహం జరగకుండా ప్రభుత్వానికి సహకరించాలి. కార్యక్రమంలో ICDS CDPO కృష్ణకుమారి, సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ టీచర్స్, ANM‌లు, గ్రామస్తులు పాల్గొన్నారు.