BREAKING
thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి
Date of Publish : 18 June 2026, 09:34 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఎన్టీఆర్ జిల్లాలో నకిలీ ఇన్స్టాగ్రామ్ ఖాతాలపై కలెక్టర్ హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Jun, 2026 - 09:34 AM
135 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లాలో కొంతమంది సైబర్ మోసగాళ్లు జిల్లా కలెక్టర్ పేరు ఉపయోగించి నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు సృష్టించి ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ G. Lakshmi Sha తెలిపారు.

ఈ నకిలీ ఖాతాల ద్వారా ప్రజలను సంప్రదిస్తూ డబ్బు లేదా ఇతర ఆర్థిక ప్రయోజనాలు కోరుతున్నట్లు గుర్తించినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఇలాంటి ఖాతాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని, వాటికి స్పందించవద్దని ప్రజలకు సూచించారు.

అలాగే వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా సమాచారం, ఓటీపీలు, పాస్‌వర్డ్లు వంటి సున్నితమైన సమాచారాన్ని ఎవరికీ వెల్లడించవద్దని హెచ్చరించారు. అధికారుల పేర్లతో వచ్చే సందేశాలు లేదా సోషల్ మీడియా ఖాతాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలని, అనుమానాస్పద సోషల్ మీడియా ఖాతాలు లేదా సందేశాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.