BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 28 May 2026, 04:03 pm
Posted by : మూసలమడుగు వెంకట్ ప్రసాద్

ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎంపీ కేశినేని చిన్ని

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
28 May, 2026 - 04:03 PM
137 వీక్షణలు

ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎంపీ కేశినేని చిన్ని

ఎన్టీఆర్ జయంతి తెలుగు వారందరికీ పండుగ రోజు

తొమ్మిది నెలల్లోనే పార్టీని అధికారంలోకి తెచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్

బడుగు బలహీన వర్గాల కోసం పెట్టిన పార్టీ టిడిపి

ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎంపీ కేశినేని చిన్ని

విజయవాడ( ఎంపీ కార్యాలయం) విజయవాడ గురునానక్ కాలనీలోని ఎంపీ కార్యాలయం నందు ఎన్టీఆర్ 103 వ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ వేడుకకు విజయవాడ పార్లమెంటు సభ్యులు ఎంపీ కేశినేని చిన్ని ముఖ్యఅతిథిగా హాజరయ్యారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ని సంవత్సరాలైనా ఎన్టీఆర్  యుగపురుషుడైనని కేవలం 9 నెలల్లోనే పార్టీని స్థాపించి అధికారంలోకి తీసుకువచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్ అని కొనియాడారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించారని అన్నారు పటేల్ పట్వారి వ్యవస్థను రూపుమాపి సామాన్య ప్రజలకు న్యాయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు

కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యాన్ని తగ్గించి జాతీయస్థాయిలో ఫ్రంట్ ను అధికారంలోకి తెచ్చిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు.ఎన్టీఆర్ ఆశయాల బాటలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీని అన్ని విధాలుగా ముందుకు నడిపిస్తూ అధికారంలోకి పార్టీని తీసుకువచ్చారని యువ నేత లోకేష్ సైతం పార్టీని అన్ని విధాలుగా ముందుండి నడిపిస్తూ పాత తరం నవతరం యువతరం అందరినీ సమన్వయం చేస్తూ నడిపిస్తున్నారని కొనియాడారు

త్వరలో వైసిపి చేపట్టబోయే వెన్నుపోటు కార్యక్రమాలపై మాజీ సీఎం జగన్ పై ఎంపీ చిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు తల్లి చెల్లిని జగన్ వెన్నుపోటు పొడిచారని బాబాయిని గొడ్డలి పోటు పొడిచాడని అందుకే వైసిపి గొడ్డలి పార్టీ అని వెన్నుపోటు దారులంతా ఆ పార్టీలోనే ఉన్నారని తీవ్రంగా విమర్శించారు జగన్ కుటుంబ సభ్యులనే కాదు రాష్ట్ర ప్రజలందరినీ కూడా వెన్నుపోటు పొడిచారని అన్నారు

ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో టిడిపి సీనియర్ నాయకులు బొప్పన భవకుమార్ నాగ వంశం కార్పొరేషన్ చైర్మన్ ఎరుపోతు రమణ జాస్తి సాంబశివరావు చెన్నుపాటి గాంధీ చెన్నుపాటి ఉషారాణి నరసింహ చౌదరి సొంగ సంజయ్ వర్మ సంతోష్ కుమార్ చలసాని రమణ ప్రేమనాథ్ కోనేరు కిషోర్ బంక నాగమణి వ్యాస్ మాదిగని గురునాథం మరియు టిడిపి నేతలు పాల్గొన్నారు