BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 29 March 2026, 12:07 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఎర్రగుంటపల్లిలో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Mar, 2026 - 12:07 PM
167 వీక్షణలు

ఎర్రగుంటపల్లిలో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలోని వాటర్ ట్యాంక్ సమీపంలో, కీ"శే" శ్రీ తాళ్లూరి సాంబశివ రెడ్డి  విగ్రహం వద్ద ఈరోజు (29-03-2026) తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 44వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.

చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ఆదేశాల మేరకు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు, అధ్యక్షురాలు శ్రీమతి తాళ్లూరి రాధా రాణి  ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు అల్లు చెన్నారెడ్డి, ఎంపీటీసీ విజయభాస్కర్, వైస్ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి, వై.వి. సత్యనారాయణ, నారా లోకేష్ యోజన ఫౌండేషన్ సోషల్ మీడియా ప్రతినిధులు, కురం నాగ దుర్గారావు, గారపాటి సత్యనారాయణ, అలవాల శంకర్ రెడ్డి, గోలి సత్యనారాయణరెడ్డి (తెలుగు యువత), వి. సత్యనారాయణ శాస్త్రి, టీవీ ఆర్టిస్ట్ వర్ర నాగరాజు, నీలి తాతారావు, ఉమ్మడి శ్రీను, కోటమర్తి రవి, కుప్పాల సోమయ్య, సాదరబోయిన వెంకటస్వామి, కురం రామారావు, బొల్లు వెంకటేశ్వరరావు తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

పార్టీ పట్ల తమ నిబద్ధతను వ్యక్తం చేస్తూ నాయకులు మాట్లాడుతూ, భవిష్యత్తులో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమం ఉత్సాహభరిత నినాదాలతో విజయవంతంగా ముగిసింది.