BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 24 March 2026, 02:17 pm
Posted by : కూనురు మధు

ఎస్ఎఫ్ఐ నకిరేకల్ డివిజన్ అధ్యక్షుడిగా ఆరూరి ప్రణీత్ ఏకగ్రీవ ఎన్నిక

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
24 Mar, 2026 - 02:17 PM
308 వీక్షణలు

ఎస్ఎఫ్ఐ నకిరేకల్ డివిజన్ అధ్యక్షుడిగా ఆరూరి ప్రణీత్ ఏకగ్రీవ ఎన్నిక 

భారత విద్యార్థి ఫెడరేషన్   (ఎస్ఎఫ్ఐ) నకిరేకల్ డివిజన్ నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డివిజన్ అధ్యక్షుడిగా ఆరూరి ప్రణీత్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ప్రణీత్ మాట్లాడుతూ విద్యార్థి లోకం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటాలు నిర్వహిస్తామని ప్రకటించారు. ​భగత్ సింగ్ ఆశయాల సాధనే లక్ష్యంగా, విద్యా రంగంలోని అస్తవ్యస్త పరిస్థితులపై సమరశీల పోరాటాలకు సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థుల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసే ఏకైక సంఘం ఎస్ఎఫ్ఐ అని, రాబోయే రోజుల్లో డివిజన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం ఉద్యమిస్తామని ప్రణీత్ పేర్కొన్నారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన నాయకత్వానికి, విద్యార్థులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.