BREAKING
దేవవరం గ్రామ పార్టీ అధ్యక్షులు కొరిమి సూర్య గణేష్ సత్యనారాయణ ని వెంకటేష్ పరామర్శించారు.. సిఐ చిన్నమల్లయ్యని ఉద్యోగం నుండి శాశ్వతంగా డిస్మిస్ చేస్తూ ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠి ఉత్తర్వులు జారీ.. వెన్నుపోటుకు రెండేళ్లు: కూటమి వైఫల్యాలపై రేపటి నుంచి నిరసనలు లలిత ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న: ప్రముఖ వైద్యులు కొమ్మినేని వీరశంకర్ రావు,డాక్టర్ రేష్మా డీఎస్సీ అభ్యర్థులకు అండగా నిలిచిన వైయస్ జగన్ నాగార్జున సాగర్ కాలువల నిర్వహణ పనులకు రూ.42.19 కోట్లు మంజూరు అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాముల్ని చేయండి : ప్రత్తిపాటి చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పోస్టర్ ఆవిష్కరణ పల్నాడు జిల్లా స్పెషల్ బ్రాంచ్ సీఐగా సామినేని ఆంథోనీ రాజు బాధ్యతల స్వీకరణ.. యడ్లపాడులో ‘AI ఆధారిత సూపర్ నారి యాప్’ పై వీఓఏలకు శిక్షణ. దేవవరం గ్రామ పార్టీ అధ్యక్షులు కొరిమి సూర్య గణేష్ సత్యనారాయణ ని వెంకటేష్ పరామర్శించారు.. సిఐ చిన్నమల్లయ్యని ఉద్యోగం నుండి శాశ్వతంగా డిస్మిస్ చేస్తూ ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠి ఉత్తర్వులు జారీ.. వెన్నుపోటుకు రెండేళ్లు: కూటమి వైఫల్యాలపై రేపటి నుంచి నిరసనలు లలిత ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న: ప్రముఖ వైద్యులు కొమ్మినేని వీరశంకర్ రావు,డాక్టర్ రేష్మా డీఎస్సీ అభ్యర్థులకు అండగా నిలిచిన వైయస్ జగన్ నాగార్జున సాగర్ కాలువల నిర్వహణ పనులకు రూ.42.19 కోట్లు మంజూరు అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాముల్ని చేయండి : ప్రత్తిపాటి చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పోస్టర్ ఆవిష్కరణ పల్నాడు జిల్లా స్పెషల్ బ్రాంచ్ సీఐగా సామినేని ఆంథోనీ రాజు బాధ్యతల స్వీకరణ.. యడ్లపాడులో ‘AI ఆధారిత సూపర్ నారి యాప్’ పై వీఓఏలకు శిక్షణ.
www.ntodaynews.com

భూ భారతిలో కూడా పేదలకు సంబంధించిన భూ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు

తెలంగాణ
25 Oct, 2025 - 08:53 PM
275 వీక్షణలు
భూ భారతిలో కూడా పేదలకు సంబంధించిన భూ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు --- సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ర్యాకల శ్రీశైలం NTODAY NEWS: బొమ్మలరామారం కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన భూ భారతి చట్టంలో కూడా నిరుపేదలకు, దళితులకు, గిరిజనులకు సాగు చేసుకుంటున్న భూములకు నూతన పాస్ పుస్తకాలు పట్టాలు అందడం లేదని, మండలంలోని భూ సమస్యలు కూడా పరిష్కారం కావడంలేదని బొమ్మలరామారం సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ర్యాకల శ్రీశైలం అన్నారు. శనివారం రోజున బొమ్మలరామారం మండలంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో శ్రీశైలం మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పేరుతో పేదలు సాగు చేసుకుంటున్న భూములను వివిధ ప్రభుత్వ అవసరాల పేరుతో గుంజుకున్నారని,అనేక సమస్యలను సృష్టించి పాసుబుక్కులను రద్దుచేసి నిరుపేద కుటుంబాలను తీవ్ర అన్యాయం చేసిందని అన్నారు గత ప్రభుత్వం నిరుపేద కుటుంబాలకు కొత్త పాసుబుక్కులు కూడా ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెట్టార విమర్శించారు. కాంగ్రెసు పార్టీ ఎన్నికల్లో మమ్ములను అధికారంలోకి తీసుకొస్తే ధరణి చట్టాన్ని రద్దుచేసి కొత్త చట్టం తెచ్చి భూ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపిస్తామని చెప్పారని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నూతన చట్టాన్ని తెచ్చిన పేదలకు మాత్రము ఒరిగింది ఏమీ లేదని అన్నారు పెద్ద ఎత్తున బొమ్మలరామారం మండలంలో రెవెన్యూ సభలు పెట్టి దరఖాస్తులు తీసుకొని సమస్యలు పరిష్కరిస్తామన్న ప్రభుత్వం ఎందుకు పేదలు సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూములకు పట్టాలు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పాలకుల హామీలు ఎన్నికల్లో తమ గెలుపు కోసం,తమ పదవుల కోసం తప్ప పేదల సంక్షేమం కోసం కాదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజల ఆర్థిక పరిస్థితిలో మార్పు రావాలన్న,ఆత్మగౌరవంతో జీవించాలన్న భూమి చాలా కీలకమని అన్నారు మండలంలో పేదలు సాగు చేసుకుంటున్నా భూములకు పట్టాదారు పాసుబుక్కులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూముల పాస్ పుస్తకాల గురించి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన సర్వేలు, సదస్సులు నిర్వహించి తాహసిల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు సాయి,పున్నమ్మ, వెంకటేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube