BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం
Date of Publish : 25 November 2025, 04:32 am
Posted by : NTODAY NEWS OFFICIAL

రాజ్యాంగాన్ని పరిరక్షించటానికి ప్రతి ఒక్కరూ సైనికుల వలె పనిచేయాలి

తెలంగాణ
25 Nov, 2025 - 04:32 AM
369 వీక్షణలు
రాజ్యాంగాన్ని పరిరక్షించుట ప్రతి ఒక్కరూ సైనికుల వలె పనిచేయాలి దళిత సేన పిలుపు NTODAY NEWS: ఏలూరు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కళ్యాణ్ కుమార్, ఏలూరు జిల్లా, ఏలూరు నగరంలో రాజ్యాంగాన్ని ఆమోదించి 75 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా దళిత సేన రాష్ట్ర ముఖ్య నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మొదటగా దళిత సేన నాయకులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల అలంకరణ చేశారు. అనంతరం దళిత సేన వ్యవస్థాపక అధ్యక్షులు జిజ్జువరపు రవిప్రకాష్ మాట్లాడుతూ రాజ్యాంగ రచన కమిటీకి చైర్మన్ గా వ్యవహరించి రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలంలో రూపకల్పన చేసి భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన గొప్ప మేధావి రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు కావున ప్రతి ఒక్కరు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని రాజ్యాంగాన్ని పరిరక్షించుటకు ప్రతి ఒక్కరు సైనికులు వలె పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో దళిత సేన రాష్ట్ర కార్యదర్శి కాకర్లమూడి వెంకటరావు, ఏలూరు జిల్లా దళిత సేన మహిళా అధ్యక్షురాలు బేతాళ జయసుధ, పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు చీలి మోహనరావు, పశ్చిమగోదావరి జిల్లా మహిళా అధ్యక్షురాలు దిరుసు పాముల పుష్ప, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు దిరుసు పాము కృష్ణమూర్తి, కృష్ణాజిల్లా అధ్యక్షులు భూసే అనిల్ కుమార్, ఏలూరు జిల్లా దళిత సేన ఇన్చార్జ్ పెదపాటి ఏసురత్నం, ఏలూరు జిల్లా కార్యదర్శి ఇదియా, ఏలూరు జిల్లా మహిళా కార్యదర్శి ముత్యాల ఝాన్సీరాణి, తాడేపల్లిగూడెం నియోజకవర్గ అధ్యక్షులు దూలపల్లి సత్తయ్య, నూజివీడు నియోజకవర్గం అధ్యక్షులు సుధీర్, తాడేపల్లిగూడెం మండల అధ్యక్షులు ఉండ్రాజు వరపూ కృష్ణ, పెదవేగి మహిళా అధ్యక్షురాలు రే మల్లె స్వర్ణకమల, తాడేపల్లిగూడెం ఉపాధ్యక్షులు రవి, తాడేపల్లిగూడెం మహిళా అధ్యక్షురాలు యలమర్తి రమణ, మొదలగు నాయకులు పాల్గొన్నారు Follow us on Website Facebook Instagram YouTube