BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 07 March 2026, 04:59 am
Posted by : NTODAY NEWS OFFICIAL

రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలి

తెలంగాణ
07 Mar, 2026 - 04:59 AM
388 వీక్షణలు
రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలి: బీఆర్ఎస్ నాయకుల నిరసన NTODAY NEWS: మంచిర్యాల, ప్రతినిధి వి. శ్రీనివాస్ రైతు భరోసా నిధులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల నియోజకవర్గంలోని దండేపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్ కుమార్ నేతృత్వంలో రైతులు ఈ నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన మూడు విడతల రైతు భరోసా నిధులను నిలిపివేసిందని ఆరోపించారు. వెంటనే ఆ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. గతంలో మూడు ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే భరోసా అందించి మిగతా రైతులకు అన్యాయం జరిగిందని విమర్శించారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల లోపు రైతు భరోసా నిధులు పూర్తిగా విడుదల చేయని పక్షంలో మంచిర్యాల నియోజకవర్గ వ్యాప్తంగా కలెక్టరేట్ ముట్టడి చేపడతామని హెచ్చరించారు. రైతుల హక్కుల కోసం పోరాడేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఈ సందర్భంగా నాయకులు స్పష్టం చేశారు. #Mancherial #RythuBharosa #BRSParty #FarmersProtest #TelanganaNews #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube