BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 19 June 2026, 02:52 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

FRS 360 సాంకేతికతతో మూడు సంవత్సరాల మిస్సింగ్ కేసు ఛేదన – చింతలపూడి పోలీసుల సక్సెస్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Jun, 2026 - 02:52 PM
141 వీక్షణలు

ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలో మూడు సంవత్సరాలుగా గల్లంతైన మహిళ, బాలిక కేసులో కీలక పురోగతి చోటుచేసుకుంది. ఆధునిక FRS 360 సాంకేతిక పరిజ్ఞానం, సీసీటీవీ నెట్‌వర్క్ సహాయంతో చింతలపూడి పోలీసులు మిస్సింగ్ వ్యక్తులను గుర్తించి ఆచూకీ కనుగొన్నారు.

దీర్ఘకాలంగా మిస్టరీగా ఉన్న ఈ కేసును పోలీసులు ఆధునిక సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేసి విజయవంతంగా ఛేదించారు. మూడు సంవత్సరాల తరువాత ఇద్దరి ఆచూకీ లభించడంతో కేసులో పురోగతి నమోదైంది.

ఈ ఆపరేషన్‌ను చింతలపూడి సీఐ క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో చేపట్టగా, ఎస్‌ఐ సతీష్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ రాంబద్రరావు కలిసి సాంకేతిక బృందంతో సమన్వయం చేసి మిస్సింగ్ వ్యక్తులను గుర్తించారు.

చింతలపూడి పరిధిలో జరిగిన ఈ విజయవంతమైన ఆపరేషన్‌పై స్థానికులు పోలీసుల పనితీరును అభినందిస్తున్నారు. ఆధునిక సాంకేతికత వినియోగంతో దీర్ఘకాల కేసును ఛేదించడం పోలీసుల సామర్థ్యాన్ని స్పష్టంగా చూపిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.