BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 17 June 2026, 07:18 pm
Posted by : V శ్రీనివాస్

​గడువులోగా కేజీబీవీ అభివృద్ధి పనులు పూర్తి చేయాలి: జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
17 Jun, 2026 - 07:18 PM
186 వీక్షణలు

​నస్పూర్ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో (కేజీబీవీ) చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, నిర్దేశిత గడువులోగా వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన పాఠశాలను సందర్శించి నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని, నిర్మాణ సామగ్రి నాణ్యతలో గానీ, భద్రతలో గానీ ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా పనులు చేపట్టాలన్నారు. అనంతరం విద్యార్థినులతో మాట్లాడుతూ.. వారికి అందుతున్న వసతులు, విద్యా సదుపాయాలు, భోజనం తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని క్రమశిక్షణతో ఉన్నత లక్ష్యాలను సాధించాలని, విద్యాభ్యాసంతో పాటు వ్యక్తిత్వ వికాసం, ఆరోగ్యం, పరిశుభ్రత పట్ల కూడా శ్రద్ధ వహించాలని విద్యార్థులకు ఆయన సూచించారు.

​అనంతరం పాఠశాలలోని హాజరు, అకడమిక్, ఇతర పరిపాలనా రికార్డులను పరిశీలించిన అదనపు కలెక్టర్.. ఉపాధ్యాయులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి సారించి, వారి అభ్యాస స్థాయిలను నిరంతరం పర్యవేక్షించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాలలో నాణ్యమైన బోధనతో పాటు పరిశుభ్రమైన వాతావరణం, క్రమశిక్షణ ఉండేలా చూడాలన్నారు. వంటగది, స్టోర్ రూమ్, తరగతి గదులు, వసతి గదులను ఆయన తనిఖీ చేసి, విద్యార్థినుల సంక్షేమం, భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సిబ్బందికి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ ప్రత్యేక అధికారి, ఉపాధ్యాయులు, గుత్తేదారులు, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు