BREAKING
thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన
Date of Publish : 23 March 2026, 10:53 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గండ్రపల్లిలో వరుస మరణాలు కలకలం

తెలంగాణ
/ కరీంనగర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Mar, 2026 - 10:53 PM
175 వీక్షణలు

గండ్రపల్లిలో వరుస మరణాలు కలకలం  ‘కీడు’ భయంతో ఊరు ఖాళీ చేసిన గ్రామస్థులు

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం గండ్రపల్లి గ్రామంలో గత మూడు నెలలుగా చోటుచేసుకున్న వరుస మరణాలు స్థానికంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ కాలంలో మొత్తం 28 మంది వివిధ కారణాలతో మరణించినట్లు గ్రామస్థులు చెబుతున్నారు.

ఈ పరిణామాలతో భయాందోళనకు గురైన గ్రామ ప్రజలు, గ్రామానికి ఏదో ‘కీడు’ సోకిందనే నమ్మకానికి వచ్చారు. పురోహితుడి సూచన మేరకు గ్రామాన్ని ఒక రోజు పూర్తిగా ఖాళీ చేయాలని నిర్ణయించారు.

అందులో భాగంగా తెల్లవారుజామునే ఇళ్లకు తాళాలు వేసి, డప్పు చాటింపు ద్వారా గ్రామస్థులు అందరూ బయటకు వెళ్లి సమీప పొలాల్లో గడిపారు. అక్కడే ప్రత్యేకంగా ‘కీడు వంటలు’ నిర్వహించి గ్రామానికి పట్టిన పీడ తొలగుతుందని విశ్వసించారు.

ఇదిలా ఉండగా, తక్కువ వ్యవధిలో ఎక్కువ మరణాలు సంభవించడంపై అధికార యంత్రాంగం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, మరణాలకు గల అసలు కారణాలను వెలికితీయాలని కోరుతున్నారు.