BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 11 April 2026, 04:15 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

గంజాయి గుట్టురట్టు నలుగురు ముఠా సభ్యుల అరెస్ట్..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
11 Apr, 2026 - 04:15 PM
136 వీక్షణలు

గంజాయి' గుట్టురట్టు: నలుగురు ముఠా సభ్యుల అరెస్ట్..

రూ. లక్ష విలువైన గంజాయి స్వాధీనం.. అదనపు ఎస్పీ ఎం. వెంకటాద్రి వెల్లడి..

మదనపల్లె, ఏప్రిల్ 11: మదనపల్లె పరిసర ప్రాంతాల్లో గంజాయి సరఫరా చేస్తున్న ముఠా గుట్టును తాలూకా పోలీసులు రట్టు చేశారు. ఉల్లిపాయల లోడ్ కింద భారీ ఎత్తున గంజాయిని తరలిస్తున్న పాత కేసులో పరారీలో ఉన్న నలుగురు ముద్దాయిలను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 1,00,000 విలువైన 4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు, జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) శ్రీ ఎం. వెంకటాద్రి గారు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.

*తనిఖీల్లో దొరికిపోయారు..*

జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, అదనపు ఎస్పీ ఎం. వెంకటాద్రి గారి (మదనపల్లి సబ్ డివిజన్ ఇంచార్జి) పర్యవేక్షణలో మదనపల్లె తాలూకా సీఐ కె. కళా వెంకటరమణ తన సిబ్బందితో కలిసి శనివారం ఉదయం బసినికొండ పంచాయతీ పరిధిలోని కనుమలో గంగమ్మ గుడి సమీపంలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో పుంగనూరు వైపు నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు దిగి, అనుమానాస్పదంగా నల్లటి కవర్లతో పారిపోవడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలను పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.

*పాత కేసులో పరారీలో ఉన్న నిందితులు:* మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్‌లో గతంలో నమోదైన 179 కేజీల గంజాయి స్మగ్లింగ్ కేసు (Cr.No.49/2026) లో వీరంతా పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పట్టుబడిన వారిలో శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలానికి చెందిన మల్లెల మహేష్, మల్లెల అమరావతితో పాటు, పుంగనూరు పట్టణానికి చెందిన మల్లెల రాజమ్మ, మల్లెల చంటి ఉన్నారు. నిందితుల నుంచి 4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని, వారిని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో ప్రధానంగా గంజాయి విక్రయించిన మరో నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేసినట్లు అదనపు ఎస్పీ గారు తెలిపారు.

*యువత భవిష్యత్తును చిదిమేస్తే కఠిన చర్యలు:* ఈ సందర్భంగా అదనపు ఎస్పీ గారు మాట్లాడుతూ.. "జిల్లాలో గంజాయి సాగు, రవాణా, విక్రయాల మీద ఉక్కుపాదం మోపుతున్నాం. ముఖ్యంగా యువతను మత్తుకు బానిసలుగా మారుస్తున్న ముఠాలపై ప్రత్యేక నిఘా ఉంచాం. గంజాయి విక్రేతలపై పీడీ యాక్ట్ వంటి కఠిన చట్టాలను ప్రయోగిస్తాం" అని హెచ్చరించారు. జిల్లాను డ్రగ్స్ రహితంగా మార్చేందుకు ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని, అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం అందించాలని కోరారు. సమర్థవంతంగా పనిచేసి నిందితులను పట్టుకున్న మదనపల్లె తాలూకా పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

👇

*అన్నమయ్య పోలీస్*