BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 03 August 2026, 08:06 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గంపలగూడెం మండలానికి మరో గౌరవం.. పలువురికి రాష్ట్రస్థాయి సత్కారం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Aug, 2026 - 08:06 AM
69 వీక్షణలు

తిరువూరు, ఆగస్టు 3: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని గంపలగూడెం మండలానికి చెందిన పలువురు వివిధ రంగాల్లో విశిష్ట సేవలు, ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పురస్కారాలకు ఎంపికై సత్కారం అందుకున్నారు. సామాజిక, సేవా, సాంస్కృతిక సంస్థ రుద్రాక్ష వైభవం ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో ఆదివారం సికింద్రాబాద్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రదానం చేశారు.

గంపలగూడెం మండలం నుంచి మురళీకృష్ణకు ఉత్తమ వ్యాపార సేవా రత్న పురస్కారం, సునీతకు భగవద్గీత ప్రచార వైభవ మహిళా రత్న పురస్కారం, పద్మనాభుని సర్వేశ్వరరావుకు ఏపీ శ్రీ కోదండరామస్వామి ఉత్తమ ఆలయ చైర్మన్ పురస్కారం, నాగ లక్ష్మణరావుకు వాసవి సేవా సమాజ వైభవ సామ్రాట్ పురస్కారం ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా రుద్రాక్ష వైభవం ఆధ్యాత్మిక పీఠం అధ్యక్షుడు డాక్టర్ కృష్ణ చాముండేశ్వరి మహర్షి, ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా, సినీ నటుడు జనార్ధనరావు, సీవీ రామన్ అకాడమీ ప్రధాన కార్యదర్శి, నిర్వాహకుడు మహేంద్రవాడ వెంకటేశ్వరరావు విజేతలను ఘనంగా సత్కరించి ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలను అందజేశారు.

గంపలగూడెం మండలానికి చెందిన పలువురు ఒకే వేదికపై రాష్ట్రస్థాయి పురస్కారాలు అందుకోవడం పట్ల స్థానిక ప్రజలు, వివిధ సామాజిక సంస్థల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. విజేతలకు అభినందనలు వెల్లువెత్తాయి.