గణేష్ మండపాల్లో డీజే ఏర్పాటు చేస్తే భారీ జరిమానా డీజే పెట్టారంటే రూ.1 లక్ష జరిమానా.. ఏపీ పోలీసుల హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్
వినాయక చవితి వేడుకల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఏపీ పోలీసులు హెచ్చరించారు. గణేష్ మండపాల్లో అధిక శబ్దంతో డీజేలు ఏర్పాటు చేస్తే రూ.1,00,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా అధిక శబ్దం చేయకుండా నిర్వాహకులు నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు. శబ్ద కాలుష్య నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.