BREAKING
శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష
Date of Publish : 04 June 2026, 07:51 pm
Posted by : బోరా శివారెడ్డి

గొల్లప్రోలులో చలివేంద్రం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్
/ కాకినాడ / గొల్లప్రోలు
Reporter
బోరా శివారెడ్డి గొల్లప్రోలు మండల ప్రతినిధి
04 Jun, 2026 - 07:51 PM
198 వీక్షణలు

గొల్లప్రోలులో చలివేంద్రం ప్రారంభం --గుండ్ర సుబ్బారావు సేవా తత్పరత అభినందనీయం

గొల్లప్రోలు:ఎండ తీవ్రతతో అల్లాడుతున్న ప్రజల దాహార్తిని తీర్చేందుకు గొల్లప్రోలు ఇబీసీ (ఇబీసీ ) కాలనీలో ఏర్పాటు చేసిన చలివేంద్రం ఎంతో అభినందనీయమని స్థానికులు కొనియాడారు. ప్రముఖ సామాజిక కార్యకర్త, అపర భగీరథుడు, నిత్య సేవాధృక్పథం కలిగిన ప్రజా నాయకులు గుండ్ర సుబ్బారావు ఆధ్వర్యంలో ఈ చలివేంద్రాన్ని అత్యంత ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా స్థానికులు, కాలనీ పెద్దలు మాట్లాడుతూ.. మంచితనానికి మారుపేరుగా, నిరుపేదల ఆశాజ్యోతిగా, నిత్య సేవాభావానికి నిలువెత్తు చిరునామాగా నిలిచే గుండ్ర సుబ్బారావు ఈ భానుడి భగభగలను సైతం లెక్కచేయకుండా, ప్రజల సంక్షేమమే పరమావధిగా ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టడం వారి హృదయ వైశాల్యానికి నిదర్శనమన్నారు. "మాటల్లో కాదు... చేతల్లో చూపే అసలైన ప్రజా నాయకుడు" అని నిరూపిస్తూ ఆయన చేసిన ఈ నిరుపమాన సేవ సమాజంలో ఎంతో మందికి దిక్సూచిగా, ఆదర్శంగా నిలుస్తుందని ఆకాశానికెత్తారు. తలచుకుంటేనే అల్లాడిపోయే ఈ వేసవి కాలంలో, ప్రజల దాహార్తిని తీర్చడం కంటే మిన్నయైన పుణ్యకార్యం మరొకటి లేదని, అలాంటి పవిత్ర కార్యాన్ని సుబ్బారావు తమ భుజస్కంధాలపై వేసుకుని విజయవంతం చేయడం వారి సేవా నిరతికి మచ్చుతునక అని కొనియాడారు.

ఈ అద్భుత కార్యక్రమంలో కాలనీ ప్రజలు, టిడిపి  నాయకులు, కార్యకర్తలు , పెద్ద సంఖ్యలో పాల్గొని, నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసమే తపించే సుబ్బారావు కి హృదయపూర్వక ఘన కృతజ్ఞతలు మరియు సువర్ణ అభినందనలు తెలియజేశారు. ఆయన సేవా ప్రస్థానం ఇలాగే నిరంతరాయంగా కొనసాగాలని ప్రజల ఆకాంక్షించారు.