BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 06 April 2026, 06:40 pm
Posted by : V శ్రీనివాస్

గూడెం సత్యనారాయణస్వామి ఆలయ అభివృద్ధికి సీఎం గ్రీన్ సిగ్నల్

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
06 Apr, 2026 - 06:40 PM
180 వీక్షణలు

గూడెం సత్యనారాయణస్వామి ఆలయ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చొరవ

మంచిర్యాల:

ప్రముఖ పుణ్యక్షేత్రమైన గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. పిప్రి వేదికగా జరిగిన సభలో మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఉంచిన ప్రతిపాదనకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.

​ముఖ్య అంశాలు:

​నిధుల ప్రతిపాదన: గూడెం ఆలయ అభివృద్ధి కోసం రూ. 75 కోట్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు  ముఖ్యమంత్రిని కోరారు.

​సీఎం ఆదేశాలు: ఎమ్మెల్యే విన్నపంపై సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఆలయ అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు అక్కడికక్కడే దిశానిర్దేశం చేశారు.

​పుష్కరాల లక్ష్యం: రాబోయే గోదావరి నది పుష్కరాల నాటికి ఆలయ పరిసరాలను, భక్తులకు అవసరమైన వసతులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

​అన్నవరం తరహాలో: సత్యనారాయణ స్వామి వ్రతాలకు ఆంధ్రప్రదేశ్‌లోని అన్నవరం తర్వాత గూడెం ఆలయానికే అంతటి ప్రాముఖ్యత ఉందని, ఈ క్షేత్రాన్ని అదే స్థాయిలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా వివరించారు.

​గోదావరి తీరాన వెలసిన ఈ పుణ్యక్షేత్రం ప్రభుత్వ నిర్ణయంతో త్వరలోనే సరికొత్త రూపు సంతరించుకోనుంది