BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 25 June 2026, 10:40 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గోకులం షెడ్ల బిల్లుల్లో అవినీతి ఆరోపణలు.. గిద్దలూరు NREGS సిబ్బందిపై రైతుల ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Jun, 2026 - 10:40 AM
116 వీక్షణలు

మార్కాపురం జిల్లా గిద్దలూరులో గోకులం షెడ్ల బిల్లుల మంజూరులో ఉపాధి హామీ పథకం (NREGS) క్షేత్రస్థాయి సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు వెలువడుతున్నాయి. పూర్తయిన గోకులం షెడ్లకు బిల్లులు మంజూరు చేయాలంటే ఒక్కో పాడి రైతు నుంచి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు లంచం డిమాండ్ చేస్తున్నారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లంచం చెల్లించిన వారి బిల్లులు వెంటనే ప్రాసెస్ చేస్తుండగా, ఇవ్వలేని రైతుల బిల్లులను నెలల తరబడి పెండింగ్‌లో ఉంచుతున్నారని ఆరోపిస్తున్నారు.

పాడి రైతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం గోకులం షెడ్ల నిర్మాణ పథకాన్ని అమలు చేస్తోంది. ఎమ్మెల్యే అశోక్ రెడ్డి చొరవతో అనేకమంది రైతులకు షెడ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరయ్యాయి. ఆరు పశువులకు సరిపడే షెడ్డు నిర్మాణానికి సుమారు రూ.2 లక్షల వ్యయం అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో రైతు రూ.20 వేల వరకు భరిస్తే, మిగిలిన రూ.1.80 లక్షలను సబ్సిడీ రూపంలో ప్రభుత్వం అందజేస్తుంది.

అయితే షెడ్డు పూర్తయితేనే బిల్లులు చెల్లిస్తామని అధికారులు చెప్పడంతో రైతులు అప్పులు చేసి నిర్మాణాలు పూర్తి చేశారు. చాలా మంది రైతులు రూ.2 లక్షల వరకు అప్పులు తెచ్చి షెడ్లు నిర్మించినప్పటికీ, మూడు నెలలు గడిచినా బిల్లులు విడుదల కాలేదని వాపోతున్నారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని కొందరు సిబ్బంది లంచాలు డిమాండ్ చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

లంచం ఇచ్చిన లబ్ధిదారుల బిల్లులు వెంటనే సిద్ధం చేసి చెల్లింపులు జరిగేలా చేస్తున్నారని, లంచం ఇవ్వని రైతుల బిల్లులు మాత్రం ఉద్దేశపూర్వకంగా నిలిపివేస్తున్నారని రైతులు చెబుతున్నారు. ముందుగా పూర్తయిన షెడ్లకు బిల్లులు ఇవ్వకుండా, తర్వాత పూర్తయిన షెడ్లకు బిల్లులు మంజూరు చేయడం వెనుక అవినీతి కోణం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

షెడ్ల నిర్మాణానికి సంబంధించిన జీపీఎస్ ఫోటోలు, రికార్డులను ఉన్నతాధికారులు పరిశీలిస్తే అసలు విషయాలు బయటపడతాయని రైతులు అంటున్నారు. పూర్తయిన షెడ్లకు నెలల తరబడి బిల్లులు మంజూరు చేయకపోవడానికి కారణాలేమిటో అధికారులు వెల్లడించాలని కోరుతున్నారు. రైతుల వద్ద లంచాలు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న NREGS సిబ్బందిపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు ఉన్నతాధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.