BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 08 April 2026, 12:15 pm
Posted by : కూనురు మధు

గర్భిణీలు, బాలింతలు అంగన్‌వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

తెలంగాణ
08 Apr, 2026 - 12:15 PM
451 వీక్షణలు

గర్భిణీలు, బాలింతలు అంగన్‌వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ షబానా అజీమ్

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 4వ  అంగన్‌వాడీ కేంద్రంలో బుధవారం 'ఆరోగ్య లక్ష్మి' కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక కౌన్సిలర్ షబానాఅజీమ్  హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఆరోగ్య లక్ష్మి' పథకం కింద ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ, బాలింత అంగన్‌వాడీ కేంద్రానికి వచ్చి పోషక విలువలతో కూడిన భోజనాన్ని తీసుకోవాలని కోరారు. తద్వారా తల్లీబిడ్డల ఆరోగ్యం మెరుగుపడుతుందని సూచించారు.3 నుండి 6 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరి పేర్లను తప్పనిసరిగా అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదు చేయించాలి అని తెలిపారు.అంగన్‌వాడీల్లో నాణ్యమైన పూర్వ ప్రాథమిక విద్యతో పాటు, బలమైన పోషకాహారాన్ని ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. అనంతరం అంగన్వాడి కేంద్రంలోని చిన్న పిల్లలకు కౌన్సిలర్ చేతుల మీదుగా పండ్లను పంపిణీ చేశారు ​ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ ఎన్. సునీత, అంగన్‌వాడీ టీచర్ కె. మమత, ఆయా జలేదా, అలాగే వార్డులోని గర్భిణీలు, బాలింతలు , మహిళలు తదితరులు పాల్గొన్నారు.