BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 21 March 2026, 09:23 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గ్యాస్ కొరతలో ఊరట.. ఏపీలో మళ్లీ కిరోసిన్ పంపిణీ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Mar, 2026 - 09:23 PM
218 వీక్షణలు

గ్యాస్ కొరతలో ఊరట.. ఏపీలో మళ్లీ కిరోసిన్ పంపిణీ ప్రారంభం 

అమరావతి : రాష్ట్రంలో గ్యాస్ కొరత నేపథ్యంలో ప్రజలకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్నారు. హార్ముజ్ జలసంధి వద్ద ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో విశాఖపట్నానికి ఈ నెల 21న చేరాల్సిన గ్యాస్ నౌక 26న మాత్రమే చేరనున్నట్లు కేంద్రం సమాచారం అందించినట్టు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

ఈ నేపథ్యంలో గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నాయని వెల్లడించారు.

ప్రస్తుతం ఏర్పడిన గ్యాస్ కొరత దృష్ట్యా కేంద్రం కేటాయించిన 2800 కిలో లీటర్ల కిరోసిన్‌ను వచ్చే సోమవారం నుంచి రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా గిరిజన, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు లీటరు చొప్పున కిరోసిన్ అందజేయనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.

ఈ నిర్ణయంతో గ్యాస్ కొరత వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కొంతవరకు ఉపశమనం లభించనుంది.